త్రయోవింశాధ్యాయము
పురంజయుని మోక్షము
హే అత్రి మునీంద్రా! విష్ణుకృప వలన విజయుడైన పురంజయుడు ఆ తరువాత ఏమి చేశాడో వివరించు' అని అగస్త్యుడు కోరడంతో - అత్రి ఇలా చెప్పసాగాడు. భగవత్కృప వలన భండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు,, అగస్యుడు కోరడంతో __ అత్రి ఇలా చెప్పసాగాడు.
భగవత్క్శ్రుప వలన భండవ భూమిలో విజయలక్ష్మి ని వరించిన పురంజయుడు, అమరావతిలో ఇంద్రునివలె, తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్యశౌచపాలనం, నిత్యధర్మాచరణం, దానశీలత, యజ్ఞ యాగాది నిర్వహణలూ - ఇత్యాదులు చేస్తూ - ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై, విశుద్ధుడై, అరిషడ్వర్గాన్నీ - జయించి - పరమ వైష్ణవుడై మనసాగేడు. అంతేగాదు - నిరంతరమూ కూడా - శ్రీహరి పూజాప్రియుడై - ఏ దేశాలలో, ఏఏ క్షేత్రాలలో తీర్ధాలలో విష్ణువును ఏఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా - అనే తపనతో వుండేవాడు, అంతగా హరిసేవా సంవిధాన సంత్రుప్తుడైన కారణంగా -
ఒకనాడు ఆకాశవాణి - 'పురంజయా! కావేరీతీరంలో శ్రీరంగ క్షేత్రం వుంది. శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి వున్న విష్ణువును కార్తీకమాసంలో అర్చించి - జనన మరణాల నుంచి కడతేరుమని ప్రబోధించడంతో - రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి - తగినంతచతురంగా బలయుక్తుడై - అనేక తీర్ధక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్యవిధిగా శ్రీహరినే అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి, కార్తీక మాసమంతా కావేరీనదిలో స్నానాదులనీ, శ్రీరంగంలో రంగనాథ సేవలనూ చేస్తూ ప్రతిక్షణమూ కూడా ;కృష్ణా! గోవిందా! వాసుదేవా! శ్రీరంగనాథా!' అని హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీకమాస వ్రతం పూర్తి చేసుకుని పునః అయోధ్యను చేరుకున్నాడు. అనంతరం ధర్మకామం వలన సత్పుత్రపౌత్రాదుల్ని పొంది, కొన్నాళ్ళకు సర్వభోగ వివర్జితుడై, భార్యాసమేతంగా వానప్రస్థమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ - విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవశాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు.
ఏవం శ్రీస్కాంద పురాణాంతారగా కార్తీక మహాత్మ్యే
త్రయోవింశాధ్యాయము సంపూర్ణం
No comments:
Post a Comment