Monday, 30 November 2020

కార్తీక పురాణం-16

షోడశాధ్యాయము

జనకమహారాజా! దామోదరునకు అత్యంత ప్రీతికరమైన ఈ  కార్తీకము నెల రోజులూ నియమముగా తారబూలదానమును చేసేవాళ్లు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి పాడ్యమి లగాయితు రోజుకోక్కొక్క దీపము చొప్పున విష్ణుసన్నిధిని వెలిగించే వాళ్లు వైకుంఠగాములవుతారు.  సంతానవాంచితుడు కార్తీక పౌర్ణమినాడు వాంఛ సంకల్ప పూర్వకంగా సూర్యుని సుద్దేశించి స్నానదానాలను  చేయడం వలన సంతాన వంతులవుతారు. విష్ణుసన్నిధిని కొబ్బరికాయను దక్షిణ తాంబూలాలతో సహా దానమిచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు. దుర్మరణాలుగాని, సంతాన విచ్చేదాలు కాని జరగవు.


స్తంభరూపము


పూర్ణిమనాడు విష్ణుసన్నిధిని స్తంభదీప ప్రజ్వలనం వలన వైకుంఠ పతిత్వం సిద్దిస్తుంది. రాతితోగాని, కొయ్యతోగాని స్తంభం చేయించి దానిని విష్ణ్వాలయమునకు   ముందు పాతి, ఆ మీదట  శాలిధాన్య వ్రీహిధాన్యమును, నువ్వులనుపోసి, దానిపై నేతితో దీపము పెట్టిన వాళ్లు హరిప్రియులవుతారు. ఈ స్తంభదీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలూ నశించిపోతాయి. ఈ దీపమును పెట్టినవాళ్ళకి వైకుంఠపతిత్వము సిద్దిస్తుంది. ఇక  దీపాన్ని దానము  చేయడము వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడము ణా వల్లనయ్యే పనికాదు. ఈ స్తంభదీప మహిమకుదాహరణగా ఒక కధను చెబుతాను విను - అని  చెప్పసాగాడు వశిష్ఠుడు.

   
కొయ్య మొద్దుకు-కైవల్యము కలుగుట


నానా తరుజాల మండితమైన మతంగముని అశ్రమములో ఒక విష్ణ్వాలయము వుండేది. ఎందరెందరో మునులా ఆలయానికి వచ్చి, కార్తీకావ్రతులై ఆ నెల్లాళ్ళూ శ్రీహరిని షోడశోపచారాలతోనూ ఆర్చిస్తూండేవారు. ఒకానొక కార్తీకమాసములో వ్రతస్ధలములోని ఒక ముని - కార్తీకములో విష్ణుసన్నిధిని స్తంభదీపమును పెట్టడం వలన వైకుంఠము లభిస్తుందని చెబుతారు ఈరోజు కార్తీక పూర్ణిమ గనుక, మనము కూడా ఈవిష్ణ్వాలయ ప్రాంగణములో స్తంభదీపాన్ని వెలిగిద్దాము" అని సూచించాడు అందుకు సమ్మతించిన బూషులందరూ, ఆ గుడి యెదుటనే - కొమ్మలూ, కణుపులూ లేని స్థూపాకారపుచెట్టు నొకదానిని చూసి, దానినే స్తంభముగా నియంత్రించి, శాలివ్రీహి తిల సమేతముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి __ విష్ణర్పణము చేసి, పునః గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపము చేయసాగారు. అంతలోనే వారికి చటచ్చటారావాలు వినిపించడంతో వెనుదిరిగి స్తంభదీపము వైపు చూశారు. వాళ్ళలా చూస్తుండగానే అ స్తంభము ఫటఫటరావాలతో నిలువునా పగిలి నేలను పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు వేలువడంతో విస్మయచకితులైన ఆ ఋషులు 'ఎవరునువ్వు? ఇలా స్థాణువుగా ఎందుకు పడి వున్నావు?


నీ కథ ఏమిటో చెప్పు' అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. __ ఓమునివరేణ్యలారా! నేను గతములో ఒక బ్రాహ్మణుడను అయినా, వేదాశాస్త్ర పఠనమునుగాని, హరి కథా శ్రవణమును గాని, క్షేత్రయాత్రాటనలను  గాని, చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యము వలన బ్రాహ్మణా ధర్మాన్ని వదలి __ రాజువై పరిపాలన చేస్తూదుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు. ఆచారవంతులు , పుణ్యాత్ములు, ఉత్తములూ  అయిన బ్రాహ్మణులను నీచసనాలపై కూర్చో నియోగించి, నేను ఉన్నతాసనముపై కూర్చునే వాడిని. ఎవరికీ దాన ధర్మాలు చేసే వాణ్ణే కాదు. తప్పనిసరినప్పుడు మాత్రం __ 'ఇంతిస్తాను __ అంతిస్తాను' అని వాగ్ధానం చేసే వాణ్ణీ తప్ప, ద్రవ్యాన్నీ మాత్రము ఇచ్చే వాడిని కాను. దేవబ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికి ఖర్చుచేసుకునే వాడిని. తత్ఫలితముగా  దేహాంతాన నరకగతుడనై, అనంతరము __52 వేల మార్లు కుక్కగాను, పది వేల సార్లు కాకిగాను, మరో పదివేల సార్లు తొండగానూ, ఇంకో పదివేల సార్లు విష్ణాశినైన  పురుగుగానూ , కోటి జన్మలు చేట్టుగానూ గత కోటి జన్మలుగా ఇలా మేద్దువలెనూ పరిణమించి కాలమును గడుపుతూన్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనము కలిగిందో __ ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చినదో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి.


ఆ అద్భుత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా యిలా అన్నారు__ "ఈ కార్తీక వ్రతఫలము యదార్ధమైనది సుమా! ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా! అందునా కార్తీక పూర్ణమినాడు స్తంభదీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము. మనచే పెట్టబడిన దీపము వలన ఈ మొద్దు ముక్తిని పొందినది. మొద్దయినా __ మ్రాకైనా సరే కార్తీకములో దైవసన్నిధిని దీపాన్ని వహించడము వలన దామోదరుని దయవల్ల మోక్షమును పొందడం తథ్యము ' ఇలా చెప్పుకుంటూన్న వారి మాటలను విన్న ఉద్భూత పురుషుడు __"అయ్యలారా! దేహి ఎవరు? జీవి ఎవరు? జీవుడు దేని చేత ముక్తుడూ __ దేనిచేత బద్ధుడూ అవుతున్నాడో , దేనిచేత దేహులకింద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు" అని ప్రార్ధించదముతో, ఆ తాపసులలో వున్న అంగీకరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు.

ఏవం శ్రీస్కాంద పురాణా౦తర్గత కార్తీక మహాత్మ్యే


షోడశాధ్యాయము సంపూర్ణం

కార్తీక పురాణం-15

పంచదశ అధ్యాయం:- 

వశిష్ట ఉవాచ :
 ఓ జానక మహారాజా! కార్తీకమాసములో యెవరైతే హరి ముందర నాట్యమును చేస్తారో, వాళ్ళు శ్రీహరి ముందర నివాసులవుతారు. కార్తీక ద్వాదశినాడు హరికి దీప మాలర్పణ చేసేవాళ్ళు వైకుంఠములో సుఖిస్తారు. కార్తీక మాస శుక్ల పక్ష సాయంకాలాలందు విష్ణువుని అర్పించే వాళ్ళు __ స్వర్గ నాయకులౌతారు. ఈ నెలరోజులూ  నియమముగా విష్ణ్వాలయానికి వెళ్ళి, దైవదర్శనము చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షన్నందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకూ ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. కార్తీకమాసములో అసలు విష్ణుమూర్తిగుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకానికో, కాలసూత్ర నరకానికో వెళతారు. కార్తీక శుద్ధ ద్వాదశినాడు చేసే ప్రతి సత్కార్మా అక్షయ పుణ్యాన్నీ, ప్రతి దుష్కార్మా అక్షయ పాపాన్ని కలిగించుతాయి. శుక్ల ద్వాదశినాడు విప్రసహితుడై భక్తీయుతడై గంధ పుష్పాక్షత దీపధూపాజ్యభక్ష్య నివేదనలతో విష్ణువును పూజించే వారి, పుణ్యానికి మిటి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశినాడు శివాలయములో గాని, కేశవాలయములో గాని __ లక్ష్య ద్వీపాలను వెలిగించి సమర్పించేవాళ్ళు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీకము నేల్లాళ్ళూ దీపమును పెట్టలేనివాళ్ళు శుద్ధ ద్వాదశీ, చతుర్ధశీ, పూర్ణమ- ఈ మూడు రోజులైనా దీపమును పెట్టాలి. ఆవు నుండి పిటికెందుకు పట్టేటంత సమయమైన దైవసన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింప చేసిన వాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే, దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించి పోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను.
ఎలుక దివ్య పురుషుడగుట:-
సరస్వతీ నదీతీరంలో __ అనాదికాలముగా పూజా పునష్కరాలు లేక శిథిలమై పోయిన విష్ణ్వాలయము ఒకటు౦డేది. కార్తీక స్నానార్ధమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి  __ ఆ గుడిని చూచి, తన తఫోధ్యానలకు గాను ఆ యేకాంత ప్రదేశము అనువుగా వుంటుందని భావించి, ఆ గుడిని తుడిచాడు. నీళ్ళు జల్లాడు. చేరువ గ్రామానికి వెళ్ళి __ ప్రత్తి, నూనె,  పన్నెండు ప్రమిదలూ తెచ్చి __ దీపాలను వెలిగించి "నారాయణార్పణమస్తు " అనుకుని తనలో తాను ధ్యానమును చేసుకోసాగాడు. ఈ యతి ప్రతి రోజూ యిలా చేస్తుండగా __ కార్తీక శుద్ధ ద్వాదశినాటి రాత్రి, బైట ఎక్కడా ఆహారము దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరుగెడుతున్న ఒక ఎలుక __ ఆ గుడిలోనికి వచ్చి, ఆహారన్వేషణలో విష్ణువిగ్రహానికి ప్రదక్షణముగా తిరిగి, మెల్లగా దీపాల దగ్గరకు చేరినది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన అరిపోయిన వత్తి మాత్రమే వుంది. తడిగావున్న ఆ వత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక, అదేదో ఆహారముగా భావించి __ ఆ వత్తిని నోట  కరుచుకుని ప్రక్కనే వెలుగుతూన్న మరోదీపము వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి వున్న  __ ఆ ఆరిపోయిన వత్తికోన వెలుగుతూన్న వత్తి అగ్ని సంపర్కమై వుండడంతో ఎలుక దానిని వదిలివేసినది. అది ప్రమిదలో పడి __ రెండు వత్తులూ చక్కగా వెలగసాగాయి. రాజా! కార్తీక శుద్ధ ద్వాదశినాడు విష్ణుసన్నిధిలో ఒక  యత్రీంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా, అదే విధముగా ఎలుక వలన పునః ప్రజ్వలితమై __ తన పూర్వపుణ్యవశాన, ఆ మూషికము ఆ రాత్రి అ గుడిలోనే విగతదేహియై దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది.

అప్పుడే ధ్యానములో నుండి లేచిన యతి __ ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి "ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకొచ్చావు?" అని అడగడంతో  __ ఆ అద్భుత పురుషుడు __"ఓ యతీంద్రా! నేనొక యెలుకను. కేవలం గడ్డిపరకాల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటువంటి నకుప్పుడీ దుర్లభమైన మోక్షము ఏ పుణ్యము వలన వచ్చినదో తెలియడంలేదు.    పూర్వజన్మలో నేనెవరిని? ఏ పాపము వలన అలా యెలుకనయ్యాను? ఏ పుణ్యము వలన ఈ దివ్యదేహమును పొందాను? తపస్సంపన్నుడివైన నువ్వే నన్ను సమారాధన పరచగలవాడివి. నా యందు దయగలవాడివై వివరించు. నేను నీ శిష్యుణ్ణి" అని అంజలి ఘటించి ప్రార్ధించాడు. ఆ యతి తన జ్ఞాన నేత్రముతో సర్వాన్నీ దర్శించి యిలా చెప్పసాగాడు.


బాహ్లికోపాఖ్యానము:---


నాయనా! పూర్వము నువ్వు జైమినీగోత్ర సంజాతుడవైన బాహ్లికుడనే బ్రాహ్మణుడవు. బాహ్లిక దేశ వాస్తవ్యుడవైన నువ్వు- నిరంతరం సంసార పోషణా పరాయణుడివై స్నానసంధ్యాదుల్ని విసర్జించి, వ్యవసాయమును చేబట్టి, వైదిక కర్మానుష్ఠానులైన విప్రులని నిందిస్తూండేవాడివి. దేవతార్చనలను దిగవిడిచి సంభావనా  లాలసతతో శ్రాద్ధభోజనాలను చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా - రాత్రింబవళ్ళు తినడమే పనిగా  బ్రతికావు, చివరకు కాకబలులూ పిశాచబలులను కూడా  భుజిస్తూ- వేదమార్గాన్ని తప్పి  చరించావు. అందగత్తె యైన నీ భార్య కందిపోకండా -  ఇంటి పనులలో  సహాయార్థము ఒక దాసీదానిని నియమించి, బుద్ది వక్రించినవాడవై నిత్యం ఆ దాసీదానిని తాకుతూ, దానితో  మాట్లాడుతూ, హాస్యాలాడుతూ, నీ పిల్లలకు దాని చేతనే  భోజనాదులు పెట్టిస్తూ నువ్వు కూడా దానిచేతి కూటినే తింటూ అత్యంత హీనంగా  ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు. అంతేగాదు ధనలుబ్దుడవై నీ కూతురిని కూడా కొంత ద్రవ్యానికి, యెవరికో విక్రయింప చేశావు. ఆ విధముగా కూడబెట్టినదంతా భూమిలో దాచిపెట్టి అర్థంతరముగా మరణించావు. ఆయా పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి, పునః  యెలుకవై పుట్టి యీ జీర్ణ దేవాలయంలో వుంటూ బాటసారులు దైవ పరముగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈ రోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధద్వాదశి కావడం వలనా- ఇది విష్ణు సన్నిధానమైన కారణంగానూ-నీ యెలుక రూపము పోయి ఈ నరరూపము సిద్ధించినది.



పై విధంగా యతి చెప్పినది విని -  తన గతజన్మ కృతపాపాలకు పశ్చాత్తప్తుడై, ఆ యతి యొక్క, మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి -  కార్తీకశుద్ధ త్రయోదశి, చతుర్దశి పౌర్ణమిలలో మూడురోజులు సరస్వతీనదిలో ప్రాతఃస్నానాన్ని ఆచరించి, ఆ పుణ్య ఫలము వలన వివేకవంతుడై - బ్రతికినంత కాలమూ ప్రతీ సంవత్సరము కార్తీక వ్రతాచరణా, తత్పరుడై, మసలి, అంత్యములో సాయుజ్య మోక్షాన్ని పొందాడు. కాబట్టి- కార్తీక  శుద్ధ ద్వాదశినాడు  భాగవత్పరాయణుడై స్నాన దాన పూజా దీప మాలార్పణాదికములను నాచరించేవాడు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు - పాపనిముక్తుడునై - సాయుజ్య పదాన్ని పొందుతాడని విశ్వసించు.

ఏవం శ్రీస్కాంద పురాణా౦తర్గత కార్తీక మహాత్మ్యే


పంచదశ అధ్యాయం సంపూర్ణం 

 

Sunday, 29 November 2020

కార్తీక పురాణం-14

చతుర్ధశాధ్యాయము:-

వశిష్టుడు చెబుతున్నాడు : మిధిలాధీశా! కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేక పోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణమి నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి.


వృషోత్సర్గము


జనకా మహీపాలా! ఆవు యొక్క కోడెదూడను __ అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్చగా వదలడాన్నే వృషోత్సర్గము అంటారు. ఈ మానవలోకంలో ఏ యితర కర్మాచరణాల వలనా కూడా  అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతములో భాగముగానే, కార్తీక పూర్ణమి నాడు పితృదేవతా ప్రీత్యర్ధము ఒక కోడే (అవు) దూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్చగా వదాలాలి . అలా చేయడం వలన గయా క్షేత్రములో , పితురులకు కోటిసార్లు శ్రాద్దాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది.


    శ్లో|| యః కోవా స్మత్కులే జాతః పౌర్ణమాస్యా౦తు కార్తీకే
    ఉత్ప్రుజే ద్వ్రుషభంనీలం తేన తృప్తా వయం త్వితి||
    కాంక్షంతి నృపశార్దూల __ పుణ్యలోక స్థితా ఆపి.....


పుణ్యలోకాలలో వున్న పిరుతులు సైతం తమ కులములో పుట్టిన వాడేవడైనా కార్తీక పౌర్ణమినాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది. గదా!" అని చింతిస్తూ వుంటారు రాజా! ధనుకుడైన సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమినాడు వృషోత్సర్గమును చేయని వాడు 'అంధతామిస్రము' అనే నరకాన్ని పొందుతాడు. గయా శ్రాద్ధము వలన గాని, ప్రతివర్షాబ్దికాల వల్లగాని, తీర్ధ స్తాలలో తర్పణం అల్లగాని ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితురులు పొందరనీ గయాశ్రాద్ధ వృషోత్సారగాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా , వృషోత్సర్గమే ఉత్తమమైనదనీ తెలుసుకో." 


వివిధ దానములు

ఇక కార్తీక మాసములో పండ్లను __ దానము చేసేవాడు దేవర్షి పిత్రూణాలు మూడింటి నుంచి కూడా విముక్తుడై పోతాడు. దక్షిణాయుతంగా ధాత్రీ (ఉసిరిక) ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడౌతాడు. కార్తీక పౌర్ణమినాడు లింగదానము సమస్త పాపహరకము. అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక బోగాలను అనుభవించి, మరుజన్మలో చక్తవర్తిత్త్వాన్ని పొందుతారు.


నిషిద్ధాహారాలు


అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణా సదవకాశము అందరికీ అంత తేలికగా లభ్యముకాదు. అత్యంతోత్క్రుష్ణమైనా ఈ కార్తీక మాసములో ఇతరుల అన్నమును, పితృశేషమును, తినకూడనవి తినడము, శ్రాద్దాములకు భోక్తగా వెళ్లడము, నువ్వుల దానము పట్టడము అనే అయిదూ మానివేయాలి. ఈ నెలలో సంఘాన్నము, శూద్రాన్నము, దేవార్చకాన్నము, అపరిశుద్డాన్నము, త్యక్తకర్ముని అన్నము, విధవా అన్నము __ అనేవి తినకూడదు, కార్తీక పౌర్ణమి, అమావాస్యలలోనూ __ పితృదివసము నాడు, అదివారమునాడు  సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ వ్యతీపాతవైదృత్యాది నిషిద్ధ.

దినాలలోనూ రాత్రి భోజనము చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తము (అనగా తమ నీడ __ శరీరపు కొలతకు రెండితలుగా పడినప్పుడు భుజించుట) ఉత్తమమని మహర్షులు చెప్పారు.పరమ పవిత్రమైన ఈ కార్తీకములో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు ఆగణితాముగా పెరిగిపోతాయి. అందువలన కార్తీకములో తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచుపాత్రలో భోజనము , పరాన్నభోజనము, గృహా స్నానము నిషిద్ధ దినాలలోరాత్రిభోజనము, వేదశాస్త్ర నింద _ అనే ఈ ఏడింటిని జరుపకూడదు. సమర్ధులై వుండీ కూడా __ కార్తీకములో నదీ స్నానం  చేయకుండా యింటి దగ్గరనే వేడినీటి స్నానమును చేసినట్లయితే అది కల్లుతో చేసిన స్నానానికి సమానమవుతుందని భాహ్మశాసనము . సూర్యుడు తులలో వుండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చెరువులో నదులు లేనప్పుడు మాత్రము చెరువులలోగాని, కాలువలలోగాని, నూతివద్ద గానీ __ గంగా గోదావార్యాది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాతః కాలంలోనే స్నానం చేయాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది, అనంతరం చండాలపు జన్మనెత్తుతారు. గంగానదీ స్మరణమునుచేసి, స్నానమును చేసి, సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి,  ఆ విష్ణుగాధా, పురాణాదులను ఆలకించి __ ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకుని సాయంకాలం మరలా స్నానము చేసి __ ఆచరించి, పూజా స్థానములో పీఠమునువేసి, దాని మీద ఈశ్వరుని ప్రతిష్టించి పంచామృత, ఫాలోదక, కుశోదకాలలో మహా స్నానమును చేయించి షోడశోపచారాలతోనూ పూజించాలి.


పరమేశ్వర షోడశోపచార పూజాకల్పం


ముందుగా పరమేశ్వురుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి. అటు పిదప __

1. ఓంవృషధ్వజాయ  నమః        _ ధ్యానం సమర్పయామి (పుష్పాక్షతలు)
2. ఓం గౌరీ ప్రియాయ నమః     _ పాద్యం సమర్పయామి (నీటిచుక్క)
3. ఓం లోకేశ్వరాయ నమః     _అర్ఘ్యం సమర్పయామి (నీటిచుక్క)
4. ఓం రుద్రాయ నమః    _ ఆచమనీయం సమర్పయామి (నీటిచుక్క)
5. ఓం గంగాధరాయనమః    _ స్నానం సమర్పయామి ( నీరువిడవాలి, లేదా


మంత్రము : అషోహిష్టామయోభువ: తాన ఊర్దేదథాతన | మహేరణాయఛక్షసే
                  యోవశ్శితమోరసః తస్యభాజయతే హనః | ఉశతీరవమాతరః
                  తస్మాదారంగామామవో __ యస్యక్షయామి జిన్వధ | అపోజనయథాచనః ||

(ఈ మంత్రము పఠించుచు) నీటితో అభిపేకించవచ్చును.

6. ఓం అశాంబరాయ నమః __ వస్త్రం సమర్పయామి (వస్రయుగ్మం)
7. ఓం జగన్నాధాయ నమః  __ ఉపవీతం సమర్పయామి ( ఉపవీతం )
8. ఓం కపాలధారిణే నమః  __గంధం సమర్పయామి (కుడిచేతి అనామికతోగంధం చిలకరించాలి )
9. ఓం ఈశ్వరాయ నమః  __ అక్షితాన్ సమర్పయామి (అక్షతలు)
10. ఓం పూర్ణ గుణాత్మనే నమః  __ పుష్పం సమర్పయామి (పువ్వులు)
11. ఓం ధూమ్రాక్షాయ నమః __ ధూపమాఘ్రపయామి (అగరులేదా సాంబ్రాణి దూపమీయవలెను.)
12. ఓం తేజో రూపాయ నమః __ దీపం సమర్పయామి

(ఒక వత్తితో ఆవునేతి దీపమును వెలిగించి చూపవలెను.)



13. ఓం లోకరక్షాయ నమః  __ నైవేద్యం సమర్పయామి (నివేదన ఇవ్వవలెను.)
   
"ఓం భూర్భువస్సువః తత్ సవిటురవ రేణ్య౦ భర్గోదేవస్య ధీమహీ __ ధియోయోనః ప్రచోదయాత్ ' అనుకుంటూ ఒక పువ్వుతో __ నీవేదించు దార్దముల చుట్టూ నీటిని ప్రోక్షించి __

    1. ఓం ప్రాణాయస్వాహా , 2. ఓం అపానాయస్వాహా, 3. ఓం వ్యానాయస్వాహా, 4. ఓం ఉదానాయస్వాహా, 5. ఓం సమానాయస్వాహా, 6. ఓం శ్రీ మహాదేవాయ శివ శివ శివ శంభవే స్వాహా __ అంటూ స్వాహా అనినప్పుడల్లా ప్రభువునకు నివేదనము చూసి, ఫలానా పదార్ధమును నివేమ్దించాము. అనుకుని 'అమృతమస్తు, అమృతోపస్తరణమసి __ ఋతం నత్యేవ పరిషించామి __ ఉత్తరాపోసనం సమర్పయామి ' అనుకుని పదార్దాల కుడిప్రక్కన ఒక చుక్క నీరును వదలవలెను. పిదప __  

14. ఓం లోకసాక్షిణే నమః __ తాంబూలాదికం సమర్పయామి
    (5తమలపాకులు, 2 పోకుచేక్కలు సమర్పించాలి)
   
15. ఓం భవాయ నమః  __ ప్రదక్షిణం సమర్పయామి (ప్రదక్షణ౦)

16. ఓం కపాలినే నమః __ నమస్కారం సమర్పయామి (సాష్టాంగ నమస్కారం చేయాలి.)


జనక మహారాజా! పైన చెప్పిన విధముగా షోడశ (16) ఉపచారాలతోనూ గాని, లేదా నెల పొడుగునా ప్రతి రోజూ సహస్ర నామయుతంగా గాని శివపూజ చేసి, పూజ యొక్క చివరలో __

మంత్రము :

    పార్వతీకాంత దేవేశ పద్మజార్చ్యంఘ్రీ పంకజ
    అర్ఘ్యం గృహన దైత్యారే దత్తంచేద ముమాపతే ||


అనే మంత్రముతో  అర్ధ్యమును ఇవ్వాలి. అనంతరము యధాశక్తి దీపములను సమర్పించి, శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానమును ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీకము నెల్లాళ్ళూ కూడా బ్రాహ్మణా సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు __ వంద వాజపేయాలు, వెయ్యేసి సోమాశ్వమేధాలూ చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాసనక్త ప్రతాచరన వలన పుణ్యాధిక్యత __ పాపానాశనం అవలీలనగా ఏర్పడతాయి అనడములో ఎటువంటి సంకోచమూ లేదు. కార్తీక చతుర్దశీనాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనము పెట్టడం వలన వాళ్ళయొక్క పితాళ్ళందరూ కూడా సంత్రుప్తులు అవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశినాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశినాడు ఉపవాసము వుండి, శివారాధన చేసి, తిలలను దానము చేసినవాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై మోక్షగాములోతారు. జనక మహారాజా! కార్తీక పురాణములో ముఖ్యంగా ఈ 14 అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా, వినినా కూడా వాళ్లు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు.


    ఏవం శ్రీస్కాంద పురాణంతర్గత కార్తీక మహాత్మ్యే
   
    చతుర్ధశాధ్యాయము సమాప్తం 

కార్తీక పురాణం-13

త్రయోదశధ్యాయము


కన్యాదాన ఫలము:


వశిష్ట ఉవాచ : రాజా! యెంతచెప్పినా తరగని ఈ కార్తీక మహత్మ్య పురాణములో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను. ఏకాగ్రచిత్తుడవై విను. తప్పనిసరిగా చేయవలసిన వానిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవీ అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా _ నా తండ్రియైన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకిప్పుడు వాటిని వివరిస్తాను.


జనక రాజేంద్రా! ఈ కార్తీక మాసంలో కన్యాదాన, ప్రాతః స్నానములు,  యోగ్యుడైన బ్రాహ్మబాలకునకు ఉపనయనము చేయించడం, విద్యాదాన, వస్రదాన, అన్నదానములు __ ఇవి చాలా ప్రధానమైనవి. ధనముచేత పెదవాడూ, గుణముచేత యోగ్యుడూయైన బ్రాహ్మణా కుమారునికి - కార్తీకమాసములో వడుగుచేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు గూడా తొలగిపోతాయి. ఆ విధముగా తమ ధనముతో ఉపనయనము చేయించబడిన  వటువు చేసే గాయత్రీ జపమువల్ల దాతయొక్క పంచమాహాపాతకాలూ  నశించిపోతాయి. వంద రావిచెట్లు నాటించినా, వందతోటలను వేయించినా , వంద నూతులను __  దిగుడుబావులనూ నిర్మించినా, పది వేల చెరువులను త్రవ్వించినా వచ్చే పుణ్యమెంతయితే ఉంటుందో, అది పేదబ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యంలో పదహారోవంతుకు కూడా సమానము కాదు. ముఖ్యమైన విషయమును గుర్తుంచుకో.


    శ్లో||  మాఘ్యాం వైమాధవేమాసి చోత్తమం మౌంజి బంధనం
        కారయిష్యంతి తే రాజన్ దానం దత్వాతు కార్తీకే ||


కార్తీకంలో ఉపనయన దానమునుచేసి తడుపరిని వచ్చే మాఘములోగాని, వైశాఖములో గాని ఉపనయనమును చేయించాలి. సాధువులూ, శ్రోత్రియులూయైన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనమును చేయించడం వలన అనంతపుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పియున్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పమును చెప్పుకుని ఫలానావారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనమును చేయిస్తాను __ అని వాగ్దానము చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో.


జనక నరపాలా! ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ, బ్రాహ్మణ సమారాధనలూ వీని  వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయము జగద్విదితమే కదా! కార్తీకములో, తమ ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనముతో బాటు వివాహమును కూడా చేయించడం వలన తత్పణ్యము మరింతగా ఇనుమడిస్తుంది.


    శ్లో|| కన్యాదానం తు కార్తిక్యాం యః కుర్యాద్భక్తితో 2 నఘ
    స్వయంపాపై ర్వినుర్ముక్తః పితృణా౦ బ్రహ్హణః పదమ్ ||


కార్తీకములో కన్యాదాన మాచరించినవాడు స్వయముగా వాడు తరించడమే, గాక, వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసమును చెబుతాను విను.

 

సువీరోపాఖ్యానము


ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు వుండేవాడు. లేడికన్నుల వంటి సోగ కన్నులుగల సుందరాంగి యొకరై అతని భార్యగా వుండేది. దైవ యోగము వలన __ సువీరుడు, దాయాదులచే ఓడింపబడినవాడై, రాజ్యభ్రష్టుడై, అర్ధాంగియైన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి, కందమూలదులతో కాలము గడుపుకోసాగాడు. ఇలా వుండగా, అతని భార్య గర్భవతి అయ్యింది. రాజు నర్మదా తీరములో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలలనే అతని రాణి ఒక చక్కటి కూమార్తెను ప్రసవించింది. స్వరసంపదలూ శత్రువుల పాలైపోవడం' తాను అడవుల పాలవడం, కందమూలాలతో బ్రతుకుతూన్న ఈ రోజుల్లో కడువుపండి సంతానం కలగడం, పోషణకు చిల్లిగవ్వయినా లేని దరిద్రము - వీటన్నిటినీ పదేపదే తలచుకుంటూ తన పురాకృత కర్మలని నిందించుకుంటూ అతికష్టం మీద ఆ ఆడకూతురిని పెంచుకోసగారు సువీరదంపతలు. కాలగమనములో సువీరుని కూతురు చక్కగా యెదిగి నిజరూప లావణ్య సౌందర్యదులతో  - చూసే వారికి నేత్రానందకారిణిగా పరిణమించింది. ఎనిమిదేండ్ల ప్రాయంలోనే యెంతో మనోహరముగా వున్న ఆమెని చూసి, మోహితుడైన ఒక ముని కుమారుడు __ ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా  సువీరుని కోరాడు. అందుకా రాజు 'ఋషిపుత్రా ! ప్రస్తుతము  నేను ఘోరదరిద్రముతో వున్నాను గనుక- నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను' అన్నాడు. ఆ పిల్లమీది మక్కువ మానుకోలేని ముని బాలకుడు __ రాజా! నేను కేవలం మునికుమారుడినైన కారణముగా నీ వడిగినంత ధనమును తక్షణమే యివ్వలేను. తపస్సు చేత, తద్వారా ధనమును సంపాదించి తెచ్చి యిస్తాను. అంతవరకూ ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరచి వుంచు" అని చెప్పా, అందుకు, సువీరుడంగీకారించడంతో ఆ నర్మదాతీరములోనే తపోనిష్ఠుడై, తత్ఫలితముగా అనూహ్య ధనరాశిని సాధించి, దానిని తెచ్చి సువీరుని కిచ్చాడు. ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు' తమ యింటి ఆచారము ప్రకారముగా తన కూతురు నా ముని యువకున కిచ్చి ఆ ఆరణ్యములోనే కల్యాణమును జరిపించేశాడు. ఆ బాలిక, భర్తతో కలసి వెళ్ళిపోయింది. తత్కన్యా విక్రమ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా వుండసాగాడు. తత్ఫలితముగా  సువీరుని భార్య గర్బిణియై మళ్లా ఒక ఆడపిల్లను కన్నది. అందుకు రాజు ఆనందించాడు. పెద్దపిల్లను అమ్మిధనమును రాబట్టినట్టే __ ఈ పిల్లద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదింఛవచ్చునని __ సంతోషించాడు. బిడ్డ యెదుగుతూ వుంది, ఇదిలా వుండగా


ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికై వచ్చి, అక్కడి పర్ణశాలలో వున్న సువీరుని, అతని భార్యనూ, కూమార్తెనూ చూసి __"ఓయీ! నేను కౌండిన్య గోత్రజుడనైన యతిని __ ఈ అరణ్య ప్రాతంలో సంసారయుతగా వున్న నువ్వేవరివి? అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా __ అయ్యా! నేను వంగదేశాధీశుడనైన సువీరుడను. దయాదుల వలన రాజ్యభ్రష్టుడనై యిలా అడవిలో జీవిస్తున్నాను.   



    శ్లో||     న దారిద్ర్య సమం దు:ఖం | నాశోకః పుత్రామారణాత్
        న చవ్య ధానుగమనేన వియోగః ప్రియాపహత్ ||



దరిద్రంకన్నా ఏడిపించేదీ __ కొడుకు చావు (లేకపోవడం) కంటే ఏడవలసినదీ __ భార్యా ( రాజ్యం, భార్యా) వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతశ్శల్యంలాంటి దు:ఖం- ఇంకేమీ వుండదు. తమకు తెలిసినదే గదా! ప్రస్తుతం నేనా విధమైన మూడు రకాల విచారాల వలనా అమితదుఃఖితుడనై __ ఈ విధముగా  కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుచున్నాను. ఈ అరణ్యములోనే తొలిచూలుగా నాకోక కూతురు పుట్టినది. ఆమె నొక మునికుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బ్రతుకుతున్నాను. ఇది నా రెండవకూతురు. ఈమె నా భార్య, నాగురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను" అన్నాడు సువీరుడు


సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు "ఓ రాజా! ఎంత పని చేశావు? మూర్ఖుడవై అగణితమైన పాపాన్నీ పోగు చేసి పెట్టుకున్నావు.


    శ్లో||     కన్యా ద్రవ్యేణ యో జీవే దసిపత్రం సగచ్ఛతి
        దేవాన్ ఋషీన్ పితౄన్ క్యాపి కన్యా ద్రవ్యేణ తర్పయేత్
        శాపం దాస్యంతి తే సర్వే జన్మజన్మ న్యపుత్రతామ్ ||


ఆడపిల్లను అమ్ముకునే అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు, మరణాంతాన __ 'అసిపత్రం' అనే నరకము పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృగుణాలను చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ ఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవి చూస్తారు. అంతే గాదు __ కర్తకు జన్మజన్మలకూ కూడా పుత్రసంతానము కలకూడదని శపిస్తారు. ఇక, అలా ఆడపిల్లల నమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు - ఖచ్చితముగా రౌరవ నరకములో పడతారు __ రాజా!


    శ్లో ||     సర్వేషా మేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్భుధా:
        కన్యావిక్రయ శీలస్య ప్రాయశ్చిత్తం న చోదితమ్ ||


అన్ని రకాల పాపాలకూ ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలున్నాయి గాని, ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లనమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్రములోనూ కూడా యెటువంటి ప్రాయశ్చిత్తమూ లేదు.

కాబట్టి, సువీరా! ఈ కార్తీకమాసములో శుక్లపక్షంలో, నీ రెండవ కూమార్తెకు  కన్యాదాన పూర్వకముగా కళ్యాణం జరిపించు. కార్తీకమాసములో విద్యాతేజశ్శీలయుక్తుడైన వరునికి కన్యాదనమును చేసినవాడు __ గంగాది సమస్త తీర్దాలలోనూ స్నానదానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని, యధోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసినవాళ్ళు పొందే సత్ఫలాన్నీ పొందుతాడు" అని హితభోధ చేశాడు.


కాని, నీచబుద్దితో కూడుకొనిన సువీరుడు, ఆ సజ్జన సద్భోధను కొట్టిపారేస్తూ __ "బాగా చెప్పావయ్యా బాపడా! పుట్టినందుకు గాను __ పుత్రదారా గృహ, క్షేత్ర వాసోవసు రత్నాద్యలంకారాదులతో యీ శరీరాన్ని పుష్టిపరచి సుఖించాలేగాని, ధర్మము __ ధర్మము అంటూ కూర్చుంటే యెలాగా? అసలు ధర్మమంటే యేమిటి? దానమంటే యేమిటి? ఫలమంటే యేమిటి? పుణ్యలోకాలంటేయేమిటి? అయ్యా ఋషిగారూ! యేదోరకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానము. పెద్ద పిల్ల విషయములో కంటె అధికముగా ధనమిచ్చేవానికే నా  చిన్నపిల్లని కూడా పెండ్లిచేసి __ నేను కోరుకునే సుఖబోగాలన్నీ  అనుభవిస్తాను. అయినా- నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన నువ్వెళ్ళు- "అని కసిరికొట్టాడు అంతటితో   ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు.


శత్రుకీర్త్యు పాఖ్యాసము 


ఈ సువీరుని  పూర్వీకులలో శత్రుకీర్తీ అనే రాజోకడున్నాడు. సమస్త సద్దర్మప్రవక్తా, శతాధిక యాగాకర్తా అయిన ఆ శత్రుకీర్తి పుణ్యకార్యాల వలన స్వర్గములోని నింద్రాదులచేత గౌరవింపబడుతూ, సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు.    
సువీరునికి __ యముడు విధించిన శిక్ష కారణముగా యమదూతలు స్వర్గము చేరి __ అక్కడ సుఖిస్తున్న శత్రుకీర్తి యొక్క జీవుని పాశబుద్ధుని చేసి __ నరకానికి తీసుకుని వచ్చారు. ఆ చర్యకు కాశ్చర్యపడిన శత్రుకీర్తి యముని ముంగిట నిలబడి స్వర్గములో వున్న నన్ను  యిక్కడెందుకు రప్పించావు? నేను చేసిన పాపమేమిటి?' అని నిలదీసి అడిగాడు. మందహాసము చేశాడా మహాధర్ముడు. ఇలా చెప్పసాగాడు 'శత్రుకీర్తి! నువ్వు పుణ్యాత్ముడనే, స్వర్గార్హుడవే , కాని నీ వంశీకూడైన సువీరుడనే వాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపము వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావాల్సి వచ్చినది. అయినా వ్యక్తిగతంగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదానదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జేవిస్తూ వుంది. ఆ బిడ్డకింకా వివాహాము కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహము వలన దేహివై (భూలోక వాసులు గుర్తించే శరీర), అక్కడకు వెళ్ళి, అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి,  కన్యాదాన విదాముగా పెండ్లిని జరిపించు శత్రుకీర్తీ! ఎవడైతే కార్తీకమాసములో సర్వాలంకార భూషితయైన కన్యను యోగ్యుడైన వరునికి దానము చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు. అలా కన్యాదానమును చేయాలనే సంకల్పమును వుండీ కూడా సంతానము లేనివాడు __  బ్రాహ్మణా కన్యాదానికిగాను కన్యాదాం అందుకోబోతూన్న బ్రహ్మణునకుగాని ధన సహాయమును చేసినట్లేయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నీ పొందుతాడు. అంతే కాదు __ స్వలాభాసేక్షా రహితులై రెండు పాడి ఆవులను చెల్లించి, కన్యను కొని, ఆ కన్యను చక్కటి వరుసకిచ్చి పెండ్లి చేసే వారు కూడా కన్యాదన ఫలాన్ని పొందుతారు కాబట్టి, ఓ శత్రుకీర్తీ !  నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి, సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్భాహ్మణునకు కన్యామూలముగా దానము  చేసినట్లే అయితే __ తద్వారా నువ్వూ, నీ పూర్వీకులూ, ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు" అని చెప్పాడు.


ధర్ముని అనుగ్రహము వలన దేహాధరియైన శత్రుకీర్తీ , వెనువెంటనే భూలోకములోని నర్మదా నదీతీరాన్ని చేరి, అక్కడి వర్ణశాలలో వున్న సువీరుని భార్యకు హితవులు గరపి, వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితనుచేసి, శివప్రీతిగా 'శివార్పణమస్తు' అనుకుంటూ ఒకానొక బ్రహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు. ఆ పుణ్యమహిమ వలన సువీరుడు __ నరకపీడా విముక్తుడై , స్వర్గమును చేరి సుఖింఛసాగాడు. తదన౦తరము శత్రుకీర్తి పదిమంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారాబోయడం వలన వారి వారి పితృపితా మహిదివర్గాల వారంతా కూడా విగతపావులై , స్వర్గాన్ని పొందారు. అనంతరము శత్రుకిర్తీ కూడా యదాపూర్వకముగా స్వర్గము చేరి తన వారిని కలసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా! కార్తీకమాసములో కన్యాదానము చేసేవాడు, సర్వమూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్ధము మాట సహాయమును చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు రాజా! ఎవరైతే కార్తీక మాసములో యధావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో, వాళ్ళు స్వర్గాన్నీ, ఆచరించని వాళ్ళు నరకాన్నీ పొందుతారనడంలో ఏమాత్రం సందేహము లేదని గుర్తించు. 


ఏవం శ్రీస్కాంద పురాణంతర్గత కార్తీక మహాత్మ్యే
   
    త్రయోదశ   అధ్యాయం సమాప్తం 

Wednesday, 25 November 2020

కార్తీక పురాణం-12

ద్వాదశాధ్యాయము (వశిష్ట ప్రవచనం)

పునః వశిష్టుడు జనకునికిలా చెప్పసాగాడు: 'ఓ రాజా! కార్తికమాసములో వచ్చే సోమవార మహత్యమును విని వున్నావు. ఆ కార్తీక సోమవారము ఎంత ఫలాన్నిస్తుందో అంతకంటే కార్తీక శనిత్రయోదశి వందరెట్లు, కార్తీకపూర్ణమ _ వెయ్యిరెట్లు, శుక్లపాడ్యమి _ లక్షరెట్లు, శుక్లఏకాదశి__కోటిరెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలనూ అదనముగా ప్రసాదిస్తాయి. మోహము, చేతనైనాసరే శుక్ల ఏకాదశినాడు ఉపవసించి, మరునాడు (ద్వాదశి) బ్రహ్మణయుక్తులై పారాయణ చేసే వాళ్ళు సాయుజ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశినాడు అన్నదానమును చేసినవారికి సమస్త సంపదలూ అభివృద్ధి చెందుతాయి. రాజా! సూర్యగ్రహణ సమయంలో గంగాతీరములో కోటి మంది బ్రాహ్మణులకు అన్నసమారాధన చేయడము వలన ఎంత పుణ్యము కలుగుతుందో - అంత పుణ్యమూ కూడా కేవలము కార్తీక ద్వాదశినాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నమును పెట్టడము వలన కలుగుతుంది. వేయి గ్రహణపర్వాలు, పదివేల వ్యతీపాత యోగాలూ, లక్ష అమావాస్యాపర్వాలూ ఏకమైనా కూడా _ ఒక్క కార్తీక ద్వాదశిలో పదహారవవంతు  కూడా చేయమని తెలుసుకో. మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులెన్నయినా వుండవచ్చును గాక, కాని _ వాటన్నింటికంటే కూడా  సాక్ష్యాద్విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు.


ద్వాదశీ దానములు

ఏకాదశినాడు రాత్రి యామముండగా కార్తీకశుద్ధ ద్వాదశినాడు క్షీరసముద్రము నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీనికి హరిబోధినీ ద్వాదశి అనే పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధినినాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రహ్మణునకైనా అన్నదానమును చేస్తారో, వాళ్ళు ఇహములో భోగాను సేవనాన్నీ, పరములో భోగిశయనామ సేవనాన్నీ పొందుతారు. కార్తీక ద్వాదశినాడు పెరుగు _ అన్నదానం చేయడం సర్వోత్ర్కుష్ణమైనా దానముగా చెప్పబడుతూ వుంది. ఎవరైతే ఈ ద్వాదశినాడు పాలిచ్చే ఆవును, వెండి డెక్కలూ, బంగారు కొమ్మలతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానము చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై యెన్ని రోమాలైతే వుంటాయో, అన్నివేల సంవత్సరాలు స్వర్గములో నివసిస్తారు. ఈ రోజు వస్త్రదానము చేసినవాళ్ళు -సంచితార్దాలన్నీ సమిసిపోయి వైకుంఠాన్ని చెందుతారానడంలో ఎటువంటి వివాదమూ లేదు. పండ్లు తాంబూలము, యజ్ఞోపవీతాలను సదక్షిణగా దానము చేసేవారు. ఓ మహారాజా! ఎవరైతే కార్తీక శుద్ధద్వాదశినాడు సాలగ్రామాన్నీ బంగారపు తులసీ వృక్షాన్నీ _ దక్షణా సమేతముగా దానము చేస్తారో వాళ్ళు _ చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్నీ దానము చేసినంత పుణ్యాన్ని పొందుతూన్నారు. ఇందుకు నిదర్శనముగా ఒక గాథను చెబుతాను విను.


ధర్మవీరోపాఖ్యానము



పూర్వము గోదావరీ తీరములో దురాచారవంతుడూ, పరమ పిసినిగొట్టూ అయిన ఒక వైశ్యుడుండేవాడు. ఈ లుబ్దుడు దానధర్మాలు చేయకపోవడమేకాక, తనుకూడా తినకుండా ధనమును ప్రోగుచేసేవాడు. ధనధాన్యాలనే కాదు - కనీసము కనీసము ఎవరికీ మాట సాయమైన చేసేవాడు కాదు. నిత్యమూ పరులను నిందిస్తూ - పరద్రవ్యాసక్తుడై మసలే యీ పిసినిగొట్టు - ధనమును వడ్డీలకు తిప్పుతూ - అంతవరకూ ద్రవ్యాన్ని పెందుకోసాగాడు.


ఒకానొకసారి ఈ లుబ్దుడొక బ్రాహ్మణునికి యిచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి _ తానిచ్చిన బాకీని వడ్డీతోసహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు. అందుకు, బ్రాహ్మణుడు 'ఋణదాతా - నేను నీ బాకీ యెగవేసేవాడిని కాను ఎందుకంటావేమో!


    శ్లో ||  యో జీవితి ఋణీనిత్యం నియమం కల్పమశ్నుతే|
           పశ్చాత్తస్యసుతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి ||


 'ఎవడయితే ఋణం తీర్చకుండానే పోతాడో - వాడు మరుసటి జన్మలో ఋణదాతకు సంతురూపముగా జన్మించి ఆ ఋణాన్ని చెల్లుబెట్టుకోవసి వస్తుంది. అందుచేత యేదో విధముగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ ఋణమును చెల్లుబెడతాను. అంతవరకూ ఓర్పు వహించి వుండు' అని చెప్పాడు.


ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన లుబ్దుడు కనిసి, "నీ కబుర్లు నా దగ్గర కాదు. నీ బాకీ వసూలు కోసం నెల్లాళ్ళాగే సమయం నాకు లేదు. మర్యాదుగా ఇప్పుడే యియ్యి లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను" అన్నాడు. యదార్ధముగా ఆ సమయంలో ధనములేదనీ, అప్పటికప్పుడు తానా అప్పు తీర్చలేననీ చెప్పాడు విప్రుడు. మరింత మండిపడిన ఆ పిసినారి _ బ్రాహ్మణుడిని జుట్టు పట్టుకుని లాగి, నేలకు పడద్రోసి, కాలితో తన్ని, అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వ్రేటు పెట్టాడు. సింహము యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా, క్రోధోన్మతుడైన ఆ కోమటి కొట్టిన కత్తిదెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కోమటి _ హత్యానేరానికిగాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితముగా ఇంటికి పారిపోయి _ గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంత కాలం గుట్టుగా ఉండగలమేగాని - గుట్టుగా వున్నంత మాత్రం చేత యెల్లకాలం బ్రతకలేం గదా! అదే విధముగా ఆ కోమటి కూడా, ఆయువుదీరి మృతిచెందాడు. యమకింకరులు వచ్చి, ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు. జనకభూపతీ! 'రురువు' లనే మృగాల చేతా, వాటి శృంగాల చేతా పీడింప చేసే ఒకానొక యాతననే 'రౌరవం ' అంటారు. ఈ కోమటిని ఆరౌరవమనే నరక విభాగములో వేసి శిక్షింపవలసిందిగా ఆజ్ఞాపించాడు. యమధర్మరాజు, కింకరులు ఆ ఆజ్ఞ నమలుచేయసాగారు


ఇక ఈ భూలోకములో ఆ లుబ్ధ వైశ్యుని కుమారుడైన 'ధర్మవీరు' డనే వాడు __ మహాదాతా, పరోపకారియై __పిత్రార్జితమైన అగణిత ధనరాశులలో ప్రజా శ్రేయస్సుకై చెరువులు, నూతులు త్రవ్వించి తోటలు వేయించి __ వంతెనలు కట్టించి __ పేదలకు వివాహొపనయనాదులు చేయిస్తూ  __ యజ్ఞయాగాది క్రతువులనూ __ క్షుత్పీడితులను తరతమ భేద రహితముగా అన్నదానాలను చేస్తూ __ ధర్మాత్ముడుగా పేరు పొందాడు. ఒకానొకనాడీ ధర్మవీరుడు విష్ణుపూజ చేసే సమయానికి త్రిలోకసంచారియైన __ నారదమహర్షి యమలోకము నుండి బయలుదేరి హరినామస్మరణను చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు. ముంగిలికి వచ్చిన  మునిరాజు నారదుని చూచి ధర్మవీరుడు భక్తిప్రపత్తులతో ప్రణమిల్లాడు. అర్ఘ్యపాద్యాది వివిధోపచారాలతోనూ నారదుని పూజించి "నారదా! దేవర్షులైన  మీరిలా మా భువర్షానికి అందునా నా గృహనికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది. హే దివ్య ప్రభూ! నేను నీ దాసుడిని. నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు. నువ్వేమి చెబితే అది చేస్తాను" అని వినయ పూర్వకముగా వేడుకున్నాడు. అందుకు సంతసించిన నారదముని చిరునవ్వుముఖము కలవాడై "ధర్మవీరా! నా కోసము నువ్వేమీ చేయనక్కరలేదు. నీ శ్రేయస్సుకై చెబుతున్న నా యీ మాటల్ని శ్రద్దగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువునకు  అత్యంత ప్రియమైన రోజు, ఆ రోజున చేసిన స్నానదాన జపతపః కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్నిస్తాయి. ధర్మవీరా! సూర్యుడు తులారాశిలో వుండగా కార్తీకద్వాదశీ. ప్రాతః స్నాతులై సాలగ్రామదానమును చేసేవారు __ దరిద్రులు గానీ, ధనికులు గానీ, యతులు గానీ, వానప్రస్థులు గానీ, బ్రాహ్మణులు గానీ, క్షత్రియులు గానీ, వైశ్యులుగానీ, శూద్రులు __ స్రీలేగానీ __ వాళ్ళేవళ్ళయినా సరే జన్మ జన్మాంతర కృత పాపాలను దహింపచేసుకున్నవాళ్ళే అవుతారు. మరోముఖ్యవిషయమును చెబుతాను విను. నీ తండ్రి మరణించి, యమలోకంలో పడరానిపాట్లు పడుతున్నాడు. అతనికి నరకబాధా విముక్తిని సంకల్పించి __ నువ్వు కార్తీక ద్వాదశినాడు సాలగ్రామదానమును చెయ్యి."


నారదుడు చెప్పినదంతావిని- నవ్వేశాడు ధర్మవీరుడు. పైపెచ్చు "నారదమునీంద్రా! నా తండ్రి పేరున __ గో, భూ, తిల, సువర్ణాది దానాలు ఎన్నో చేశాను. వాటివల్ల వెలువరించబడని నరకయాతన - కేవలం సాలగ్రామమనే పేరు గలిగిన రాతిని దానము చేస్తే సాధ్యమవుతుందా?  -అయినా ఆ సాలగ్రామమనే రాయి యెందుకుదుపయోగపడుతుంది.? తినదానికా పనికిరాదు, అలంకారానికా నవరత్నాలలోనిది. కాదు. ఏరకంగానూ ఎవరికీ కూడా పనికిరాణి దానిని నీనేందుకు దానము చేయాలి. రాతి దాటకు కీర్తి వుండడు. ఆ దనమును పట్టిన వానికి సుఖమూ వుండడు. కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చెయ్యనుగాక చెయ్యను.' అన్నాడు.


నారదుడెంత అనునయముగా చెప్పినా కూడా, ధర్మవీరుడు తన మూర్ఖాత్వాన్ని వదలనూ లేదు. సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు. అంతటితో నారదుడు అంతర్హితుడైపోయాడు. మరి కొంత కాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులూ, సర్వహీతాత్ములు అయిన   పెద్దల మాటలను పాటించని పాపానికీ __ సాలగ్రామదానము చేయకపోవడము వలనా నరకగతుడై, అనంతరము మూడుమారులు పిలుగాను, మూడుసార్లు కోతిగాను, అయిదుసార్లు ఆబోతుగాను, పది పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది. పునః పదకొండవ జన్మలో కూడా ఒకానొక యాచుకుని పత్రుకగా జన్మించవలసి వచ్చింది. పురాకర్మవలన పెండ్లి కుమారుడు అనతికాలంలోనే మరణించడంతో __ ఒక్కగానొక్క కూతురుకి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టిచేత తన కూతురి పురాకర్మముగత పాపఫలాన్ని తెలుసుకున్నవాడై __ ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి __ కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా, జన్మజన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫలావాస్తి వలన __ మరణించిన పెండ్లికొడుకు పునర్జీవితుడయ్యాడు.


ఆ దంపతులు యిహజీవితాన్ని ధర్మకామసౌఖ్యాలతో గడిపి, కాలాంతర  స్వర్గమును  చేరి,  పుణ్యఫలానుభవాప్తులయ్యారు. తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా  ఒక బ్రాహ్మణునింట శిశువుగాపుట్టి,  పూర్వజన్మలో చేసిన  మహత్త్వపూర్వక సాలగ్రామ దన పుణ్యవిశేషము వలన జ్ఞానియై __ ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారము పర్వదినాలలో సాలగ్రామదానాన్ని ఆచరిస్తూ  __ ఆ పుణ్యఫలముగా మోక్షప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యము వలన 'రౌరవ' గతుడైన ఇతని తండ్రి కూడా నరకము నుండి విముక్తుడయ్యాడు.   కాబట్టి జనక మహారాజా! కార్తీకమాసములో సాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పింస్తాడని ధ్రువపరుచుకో. ఎంతటి పాపానికైనా సరే కార్తీకమాసంలో సాలగ్రామదానమును చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తము. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు అనడంలో ఎ మాత్రమూ అతిశయోక్తి లేదు.
        
ఏవం శ్రీస్కాంద పురాణంతర్గత కార్తీక మహాత్మ్యే
ద్వాదశాధ్యాయౌ సంపూర్ణం 

కార్తీక పురాణం-11

ఏకాదశాధ్యాయము



వసిష్ఠ ఉవాచ : ఓ మహారాజా! కార్తీకమాసములో శ్రీహరిని ఎవరైతే అవిసెపూలతో పూజిస్తారో  వాళ్ళకి చాంద్రాయణఫలము కలుగుతుంది. గరికతోనూ, కుశులతోనూ పూజించే వాళ్ళు పాపవిముక్తులై వైకుంఠమును పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి  సమర్పించిన  వాళ్ళు మోక్షమును పొందుతారు. కార్తీక స్నానాచరణమును చేసి విష్ణుసన్నిధిని దీపమాలికను నుంచేవాళ్ళూ, వైకుంఠ పురాణ పాతకులూ, శ్రోతలు  కూడా విగతపావులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా వినినంత మాత్రాననే సర్వపాపాలనూ సమయింపచేసేదీ __ ఆయురారోగ్య దాయినీ __ అయిన ఒక కథను వినిపిస్తాను విను.

మందరోపాఖ్యానము:


కళింగ దేశీయుడైన మంధరుడనే ఒకానోక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలన్నీటినీ విసర్జించి, పరులకు కూలిపని చేస్తూ వుండేవాడు. అతనికి పతిమిత్ర, సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్నా, సద్గుణ సముచ్చయము చేత 'సుశీల' అని పిలువబడే భార్య వుండేది.   భర్త యెంత దుర్మార్గుడైనా కూడా, అతనియందు రాగమే తప్ప ద్వేషము లేనిదై, పాతివ్రత్య నిష్టాపరురాలయి వుండేది. కొన్నాళ్ళ తరువాత, కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు వనగతుడై, ఖడ్గపాణియై- దారులుకాసి బాటసారులను కొట్టి _ వారినుండి ధనము నపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగసొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసికొనిపోయి, అమ్మి, ఆ సొమ్ముతో కుటుంబ పోషణచేసేవాడు.



ఒకసారి - దొంగతనానికై  దారికాసి వున్న మంధరుడు - బాటసారియైన  ఒకానొక బ్రాహ్మణునిని పట్టుకుని _ అక్కడి మర్రిచెట్టుకు కట్టివేసి - ఆ బాపని ద్రవ్యాన్నంతనూ అపహరింపచేశాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమక్రూరుడైన ఒక కిరాతకుడు _ దోచుకొనిన మంధరుడినీ, దోచుకోబడి బంధితుడై వున్న బ్రాహ్మణనినీ యిద్దరినీ కూడా చంపివేసి, ఆ ద్రవ్యాన్ని తాను హరించుకు పోబోయాడు. కాని, అదే సమయానికి అక్కడి కిరాత, మంధర, బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన చేరువ గుహలోని పెద్ద పులి గాండ్రుమంటూ వచ్చి - కిరాతకునిపై బడింది. పులి తన పంజాతోనూ, కిరాతకుడు  ఖడ్గ౦తోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు. ఆ జగదంలో పులీ, కిరతకుడూ కూడా యేకకాలంలోమరణించారు. ఆ విధముగా మరణించిన విప్ర, మంధర వ్యాఘ్ర , కిరాతకుల  జీవులు నలుగురూ యమలోకమును చేరి, కాలమాత్రమునే నరకాన్ని పొందారు. యమకింకురులా ఆ నలుగురినీ _ పురుగులూ, ఆమేథ్యమూతో నిండివున్న తప్త రక్తకూపంలో పడవేశాడు


ఇక భూలోకములో, భర్త మరణవార్త తెలియని మంధరుని భార్యయైన సుశీల మాత్రము నిత్యం భర్తృధ్యానాన్నే చేస్తూ ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జనసాంగత్యముతో జీవించసాగింది.  ఒకనాడు - నిరంతర హరినామ సంకీర్తనా తత్సరుడు, సర్వులయందునా భగవంతుని. దర్శించువాడూ, నిత్యానంద నర్తనుడూ అయిన ఒకానొక యతీశ్వరుడు _ ఈ సుశీల యింటికి వచ్చాడు. ఆమె శ్రద్దా భక్తులతో అతనికి భిక్షవేసి 'అయ్యా! నా భర్త కార్యార్దియై వెళ్ళి వున్నాడు. ఇంటలేడు. నేనేకాకినై అయన ధ్యానములోనే కాలమును గడుపుతున్నాను' అని విన్నవించుకుంది. అందులకా యతి 'అమ్మాయీ! ఆవేదనపడకు. ఇది కార్తీక పూర్ణమా మహాపర్వదినము. ఈ రోజు సాయంకాలము నీయింట పురాణ పఠమాశ్రవణాదులు ఏర్పాటు చేయి. అందుకుగాను ఒక దీపము చాలా అవసరము. దీపానికి తగినంత నూనై నా దగ్గరవుంది. నీవు వత్తిని _ ప్రమిదను సమర్పించినట్ట్లేయితే _ దీపమును వెలిగించవచ్చును' అని సలహా యిచ్చాడు.


ఆ యటిశ్రేష్టుని మాటలనంగీకరించి సుశీల - తక్షణమే గోమయముతో యిల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టినది. ప్రత్తిని పరిశుభ్రపరిచి, రెండు వత్తులను చేసి, యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది. యతి, ఆ దీప సహితముగా విష్ణువును పూజించి - మనశ్శుద్ది కోసం పురాణ పఠనమును ఆరంభించాడు. సుశీల పరిసరాల యిండ్లకు వెళ్ళి, వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి నడుమా  తాను కూడా ఏకాగ్రచిత్తయై ఆ పురాణాన్ని వింది. అనంతరము ఆమెకు శుభాశీస్సులనందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవనము వలన క్రమ క్రమముగా ఆమె జ్ఞానియై, తదుపరిని కాలధర్మమును చెందినది.



తత్ క్షణమే శరఖ చక్రాంకితులు, చతుర్భాహులు, పద్మాక్షులు, పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు_ నందనవన, సుందర మందారాది సుమాలతోనూ, రత్నమౌక్తిక   ప్రవాళాదూలతోనూ నిర్మించిన మాలికాంబరాభరణాలంకృతమై వున్న దివ్య విమానాన్ని తెచ్చి _ సుశీలను అందు అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళుతున్న సుశీల, మార్గమధ్యమములో నరకములో మరిముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతూన్న తన భర్తను గుర్తించి, విమానాన్ని ఆపించి _ తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషుదులను కోరింది. అందుకు వారు 'అమ్మా! నీ భర్తయైన ఆ మంధరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి - కూలియై, మరికొన్నాళ్ళు దొంగయై - దుర్మార్గ ప్రవర్తన వలన  యిలా నరకాన్ని అనుభవింస్తున్నాడు. అతనితోబాటే వున్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మిత్రుడొకనిని చంపి - అతని ధనముతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేత  బంధితుడయ్యాడు. అతగాడి పాపాలకుగాను అతడు నరకము పొందాడు. మూడవవాడు కిరాతకుడు. బంధితుడైన ఆ బ్రహ్మణునినీ, నీ భర్తను కూడా చంపివేసిన పాపానికి గాను యితడు నరకమును చేరవలసి వచ్చినది. ఇక నాలుగవ జీవి ఒక పులి. ఆ పులి అతఃపూర్వజన్మలో ద్రావిడ బ్రహ్మణుడై యుండి - ద్వాదశినాడు భక్షాభక్ష్య విచక్షణా రహితుడై ఆచరించిన తైలాదికభోజనాదుల వలన నరకమును పొంది _ పులిగా పుట్టి _ ఈ కిరాతుకుని తోడి జగడములో అతనితోబాటే నరకాన్ని చేరాడు. ఈ నలుగురి నరకయాతనలకూ కారణాలివే తల్లీ !" అని చెప్పారు.


ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి _ ఏపుణ్యము చేసినట్లయితే వాళ్ళకా నరకము తప్పుతుందో చెప్పుడని కోరగా, వైష్ణువులు కార్తీకమాసములో నీచేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితానని ధారబోయడము వలన నీ భర్తా _ పురాణ శ్రవణార్దమై నువ్వు యింటింటికీ వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యమును ధారాబోయడము వలన మిత్ర ద్రోహియైన ఆ బ్రాహ్మణుడు _ ఆ పురాణ శ్రవణార్దమై నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యమును చేరిసగముగా ధారపోయడము వలన కిరాత వ్యాఘ్రాలూ నరకము నుంచి ముక్తిని పొందుతారు." అని పలికారు. అలా వాళ్ళు చెప్పినదే తడువుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారబోయడముతో - ఆ నలుగురూ నరకము నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ విధాలుగా ప్రశింసిస్తూ - మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకుపోబడ్డ్డారు. కాబట్టి ఓ జనక మహారాజా! కార్తీకమాసములో చేసే పురాణశ్రవణము వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో.


ఏకాదశోధ్యాయ స్సమాప్త: (పదకొండవ అధ్యాయము)

కార్తీక పురాణం-10

దశమాధ్యాయము


జనక ఉవాచ: 'వశిష్ఠా! ఈ  అజామిళుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన యిలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూత లెందుకూరుకున్నారు? వాళ్లు యమునికి యేమని విన్నవించారు. అన్నీ సవిస్తరంగా చెప్పు.'


విశిష్ట ఉవాచ : నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమములో సమాధానాలు చెబుతాను విను. విష్ణుపారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి యిలా చెప్పసాగారు.

యమదూతల ఆరోపణము - యముని ఉపదేశము


అయ్యా పాపాత్ముడునూ, దురాచారుడునూ, నిందిత కర్మాచరణపరుడూ అయిన అజామిళుని యందలి జీవుని తెచ్చే సమయంలో - విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి, అతనిని మానుంచి విడిపించి, తమతో వైకుంఠానికి తీసికొని వెళ్లారు. వాళ్లను యెదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము' అని  కింకరులు చెప్పినది విని, రవంత క్రోధోద్రిక్తుడైన సమవర్తి  జ్ఞానదృష్టితో సమస్తాన్నీ అవలోకించినవాడై - కింకరులారా! కించిదపి పుణ్యవిహీనోపి - ఆ ఆజామిళుడనే పాపి, అంత్యకాలాన హరి నామస్మరణమును చేయడము వలన సమస్త  పాపాలనూ నశింపచేసుకుని, విష్ణుప్రియుడై, విష్ణుదూతల చేత తీసుకొని  పోబడ్డాడు. తెలిసి తాకినా - తెలియక తాకినా దహించవలెనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులనూ అగ్నిదహించునో అదే విధముగా - దుష్టాత్ములై, మహిమను తెలుసుకోలేక పోయినా - ఆ శ్రీహరి యొక్క నామస్మరణమును చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడి పోతాయి. ఇక, భక్తిభావముతో స్మరించినవారు కేవలము కైవల్య పథగాములే అవుతారు' అంటూ సేవకులను ఎంతవరకూ చెప్పాలో అంతవరకూ మాత్రమే చెప్పి - యముడు మరింత పూర్వాలోచనా పరుడయ్యాడు.


అజామిళుని పూర్వజన్మ


అజామిళుడు అతని  పూర్వజన్మలో సౌరాష్ట్రదేశములో శివార్చకుడుగా వుండేవాడు. ఆ జన్మలో కూడా స్నానసంధ్యాచరనాది రహితుడూ, దైవేతరచిత్తుడూ, దైవద్రవ్యాపహరి అయి వుండేవాడు. బ్రహ్మణుడయివుండి కూడా ఆయుధపాణియై, దుష్టులతో స్నేహమును చేస్తూ తిరిగేవాడు. అర్చకుడయివుండీ కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్చావిహారాలు చేసేవాడు. బహుభాషియై యవ్వనములో వుండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రహ్మణుడుండేవాడు, అతడు దరిద్రపీడితుడై- అన్నము కొరకై పట్టణములు, పల్లెలు తిరుగుతూ - యాయవార వృత్తిని అవలంబించి వున్నాడు. ఒకానొకసారి అతగాడు  తనకు లభించిన యాయవార వస్తుజాలాన్నంతటినీ మోసుకునివచ్చి భార్యను పిలిచి - 'చాలా  ఆకలిగా  వుంది. సత్వరమే వంటచేయి. ముందు కాసిని మంచినీళ్లియ్యి. అవి త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను' అన్నాడు. కాని, యౌవనమదాశ్రితయై వున్న ఆ యిల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ వుండిపోయింది. అందుకు కోపించిన భర్త, చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు

తన  కామపుటాలోచనలకు అంతరాయమును కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది. అడలీ-బడలీవున్న ఆ బాపడు అందుకై పరితాపంతో ఆమెనూ, గృహాన్నీ వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్లి, భిక్షాటనతో బతకసాగాడు. మగడు యిల్లువదలి వెళ్లిపోవడంతో మరింత తెగించిన ఆ జారిణి - మగడు తెచ్చినవన్నీ సుష్ఠుగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకుని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని, తాంబూల చర్వణము చేస్తూ - ఒకానొక రజకుని యింటికి వెళ్లి - ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది. కాని, నీతిమంతుడైన ఆ రజకుడు. ఆమె కోరిన తప్పుడుపనికి అంగీకరించకపోవడంతో - వారిద్దరికి వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంచితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణజారిణి వీధినపడి రసికులను వెతుక్కుంటూ - పోతూ ఇతఃపూర్వం చెప్పబడిన ఈశ్వరాలయార్చకుని చూసి - సురత క్రీడలకాహ్వానించింది. బ్రహ్మణుడైన వీడు - ఆమె పరస్త్రీ అని  కూడా ఆలోచించకుండా - అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిణి సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై - భర్తను వెతుక్కుంటూ వెళ్లి బ్రతిమాలి తెచ్చుకుని అది  మొదలుగా అతని మాటలకు 'తు-చ' తప్పకుండా బ్రతుకసాగింది.


ఇటువంటి పాపాలవలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాల ననుభవించి, అనుభవించి - సత్యనిష్ఠుడి కొడుకైన అజామిళుడుగా జన్మించి - కార్తీక పౌర్ణమినాటి శివసందర్శనం - అంత్యకాల హరిస్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు.


ఆనాటి శివార్చకుని జన్మలో - ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిణి కూడా కొంతకాలానికి మరణించి, నరకానుభవమును పొంది - కన్యాకుబ్దములోని ఛండాల  గృహములో బాలికగా జన్మించింది. కాని ఆ - పిల్ల - తండ్రి గండాన పుట్టడం వలన - వాళ్లా  పిల్లను అడవిలో వదలివేశారు. ఆ వనాంతర్గామియైన ఒకా బ్రహ్మణుడా బాలిక  అరణ్యరోదన విని, జాలిపడి, తనతో తీసికొని వెళ్లి, తన యింటి దాసీకి పెంపకానికిచ్చాడు. ఆ దాసీదాని దగ్గర  పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామిళుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా! నువ్వడిగిన అజామిళుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకూ హరినామా స్మరణ కన్నా  మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి వుంటుంది.

 


జనక నరపాలా! ఎవరిజిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరి చరణాల నాశ్రయించదో, ఎవరి చెవులు, శ్రీహరి సంకీర్తనల నాలకించవో వాళ్ల  పాపాలు ఏ విధముగానూ కూడా నశించే అవకాశము లేదు. ఎవరైతే ఇతర చింతలన్నిటినీ విడిచి పెట్టి విష్ణువునే ధ్యానిస్తూ వుంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహము లేదు! మోక్షాసక్తులను మురహరి స్మరణ మేవిధంగా  సూక్ష్మమార్గమో - అదే విధముగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మమార్గము కూడా  మహొత్కృష్ట పుణ్యప్రదాయినియై - పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపజేసేశక్తి ఈ కార్తీక వ్రతాచరణకకు మాత్రమే  వుండడము వలన, ఎవరైతే ఈ దివ్వవ్రతాన్ని ఆచరించరో, వాళ్లు నరక ప్రాప్తులవుతారని తెల్సుకో. పాపనాశనియైన ఈ కార్తీక మహత్మ్యన్ని శ్రద్దా భక్తులతో వినినప్పటికీ కూడా - వారు మోక్షార్హులే అవుతున్నారు. ఆసక్తులైనవారికి - పావన హృదయంతో యీ మహత్మ్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు.


ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే దశమ అధ్యాయౌ సమాప్తాః

భోగి

                                       🌾🌻🌞  భోగి 🌞🌻🌾 ‣ పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండు...