వశిష్టుడు చెబుతున్నాడు : మిధిలాధీశా! కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేక పోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణమి నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి.
వృషోత్సర్గము
జనకా మహీపాలా! ఆవు యొక్క కోడెదూడను __ అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్చగా వదలడాన్నే వృషోత్సర్గము అంటారు. ఈ మానవలోకంలో ఏ యితర కర్మాచరణాల వలనా కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతములో భాగముగానే, కార్తీక పూర్ణమి నాడు పితృదేవతా ప్రీత్యర్ధము ఒక కోడే (అవు) దూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్చగా వదాలాలి . అలా చేయడం వలన గయా క్షేత్రములో , పితురులకు కోటిసార్లు శ్రాద్దాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది.
శ్లో|| యః కోవా స్మత్కులే జాతః పౌర్ణమాస్యా౦తు కార్తీకే
ఉత్ప్రుజే ద్వ్రుషభంనీలం తేన తృప్తా వయం త్వితి||
కాంక్షంతి నృపశార్దూల __ పుణ్యలోక స్థితా ఆపి.....
పుణ్యలోకాలలో వున్న పిరుతులు సైతం తమ కులములో పుట్టిన వాడేవడైనా కార్తీక పౌర్ణమినాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది. గదా!" అని చింతిస్తూ వుంటారు రాజా! ధనుకుడైన సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమినాడు వృషోత్సర్గమును చేయని వాడు 'అంధతామిస్రము' అనే నరకాన్ని పొందుతాడు. గయా శ్రాద్ధము వలన గాని, ప్రతివర్షాబ్దికాల వల్లగాని, తీర్ధ స్తాలలో తర్పణం అల్లగాని ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితురులు పొందరనీ గయాశ్రాద్ధ వృషోత్సారగాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా , వృషోత్సర్గమే ఉత్తమమైనదనీ తెలుసుకో."
వివిధ దానములు
ఇక కార్తీక మాసములో పండ్లను __ దానము చేసేవాడు దేవర్షి పిత్రూణాలు మూడింటి నుంచి కూడా విముక్తుడై పోతాడు. దక్షిణాయుతంగా ధాత్రీ (ఉసిరిక) ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడౌతాడు. కార్తీక పౌర్ణమినాడు లింగదానము సమస్త పాపహరకము. అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక బోగాలను అనుభవించి, మరుజన్మలో చక్తవర్తిత్త్వాన్ని పొందుతారు.
నిషిద్ధాహారాలు
అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణా సదవకాశము అందరికీ అంత తేలికగా లభ్యముకాదు. అత్యంతోత్క్రుష్ణమైనా ఈ కార్తీక మాసములో ఇతరుల అన్నమును, పితృశేషమును, తినకూడనవి తినడము, శ్రాద్దాములకు భోక్తగా వెళ్లడము, నువ్వుల దానము పట్టడము అనే అయిదూ మానివేయాలి. ఈ నెలలో సంఘాన్నము, శూద్రాన్నము, దేవార్చకాన్నము, అపరిశుద్డాన్నము, త్యక్తకర్ముని అన్నము, విధవా అన్నము __ అనేవి తినకూడదు, కార్తీక పౌర్ణమి, అమావాస్యలలోనూ __ పితృదివసము నాడు, అదివారమునాడు సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ వ్యతీపాతవైదృత్యాది నిషిద్ధ.
దినాలలోనూ రాత్రి భోజనము చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తము (అనగా తమ నీడ __ శరీరపు కొలతకు రెండితలుగా పడినప్పుడు భుజించుట) ఉత్తమమని మహర్షులు చెప్పారు.పరమ పవిత్రమైన ఈ కార్తీకములో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు ఆగణితాముగా పెరిగిపోతాయి. అందువలన కార్తీకములో తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచుపాత్రలో భోజనము , పరాన్నభోజనము, గృహా స్నానము నిషిద్ధ దినాలలోరాత్రిభోజనము, వేదశాస్త్ర నింద _ అనే ఈ ఏడింటిని జరుపకూడదు. సమర్ధులై వుండీ కూడా __ కార్తీకములో నదీ స్నానం చేయకుండా యింటి దగ్గరనే వేడినీటి స్నానమును చేసినట్లయితే అది కల్లుతో చేసిన స్నానానికి సమానమవుతుందని భాహ్మశాసనము . సూర్యుడు తులలో వుండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చెరువులో నదులు లేనప్పుడు మాత్రము చెరువులలోగాని, కాలువలలోగాని, నూతివద్ద గానీ __ గంగా గోదావార్యాది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాతః కాలంలోనే స్నానం చేయాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది, అనంతరం చండాలపు జన్మనెత్తుతారు. గంగానదీ స్మరణమునుచేసి, స్నానమును చేసి, సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి, ఆ విష్ణుగాధా, పురాణాదులను ఆలకించి __ ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకుని సాయంకాలం మరలా స్నానము చేసి __ ఆచరించి, పూజా స్థానములో పీఠమునువేసి, దాని మీద ఈశ్వరుని ప్రతిష్టించి పంచామృత, ఫాలోదక, కుశోదకాలలో మహా స్నానమును చేయించి షోడశోపచారాలతోనూ పూజించాలి.
పరమేశ్వర షోడశోపచార పూజాకల్పం
ముందుగా పరమేశ్వురుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి. అటు పిదప __
1. ఓంవృషధ్వజాయ నమః _ ధ్యానం సమర్పయామి (పుష్పాక్షతలు)
2. ఓం గౌరీ ప్రియాయ నమః _ పాద్యం సమర్పయామి (నీటిచుక్క)
3. ఓం లోకేశ్వరాయ నమః _అర్ఘ్యం సమర్పయామి (నీటిచుక్క)
4. ఓం రుద్రాయ నమః _ ఆచమనీయం సమర్పయామి (నీటిచుక్క)
5. ఓం గంగాధరాయనమః _ స్నానం సమర్పయామి ( నీరువిడవాలి, లేదా
మంత్రము : అషోహిష్టామయోభువ: తాన ఊర్దేదథాతన | మహేరణాయఛక్షసే
యోవశ్శితమోరసః తస్యభాజయతే హనః | ఉశతీరవమాతరః
తస్మాదారంగామామవో __ యస్యక్షయామి జిన్వధ | అపోజనయథాచనః ||
(ఈ మంత్రము పఠించుచు) నీటితో అభిపేకించవచ్చును.
6. ఓం అశాంబరాయ నమః __ వస్త్రం సమర్పయామి (వస్రయుగ్మం)
7. ఓం జగన్నాధాయ నమః __ ఉపవీతం సమర్పయామి ( ఉపవీతం )
8. ఓం కపాలధారిణే నమః __గంధం సమర్పయామి (కుడిచేతి అనామికతోగంధం చిలకరించాలి )
9. ఓం ఈశ్వరాయ నమః __ అక్షితాన్ సమర్పయామి (అక్షతలు)
10. ఓం పూర్ణ గుణాత్మనే నమః __ పుష్పం సమర్పయామి (పువ్వులు)
11. ఓం ధూమ్రాక్షాయ నమః __ ధూపమాఘ్రపయామి (అగరులేదా సాంబ్రాణి దూపమీయవలెను.)
12. ఓం తేజో రూపాయ నమః __ దీపం సమర్పయామి
(ఒక వత్తితో ఆవునేతి దీపమును వెలిగించి చూపవలెను.)
13. ఓం లోకరక్షాయ నమః __ నైవేద్యం సమర్పయామి (నివేదన ఇవ్వవలెను.)
"ఓం భూర్భువస్సువః తత్ సవిటురవ రేణ్య౦ భర్గోదేవస్య ధీమహీ __ ధియోయోనః ప్రచోదయాత్ ' అనుకుంటూ ఒక పువ్వుతో __ నీవేదించు దార్దముల చుట్టూ నీటిని ప్రోక్షించి __
1. ఓం ప్రాణాయస్వాహా , 2. ఓం అపానాయస్వాహా, 3. ఓం వ్యానాయస్వాహా, 4. ఓం ఉదానాయస్వాహా, 5. ఓం సమానాయస్వాహా, 6. ఓం శ్రీ మహాదేవాయ శివ శివ శివ శంభవే స్వాహా __ అంటూ స్వాహా అనినప్పుడల్లా ప్రభువునకు నివేదనము చూసి, ఫలానా పదార్ధమును నివేమ్దించాము. అనుకుని 'అమృతమస్తు, అమృతోపస్తరణమసి __ ఋతం నత్యేవ పరిషించామి __ ఉత్తరాపోసనం సమర్పయామి ' అనుకుని పదార్దాల కుడిప్రక్కన ఒక చుక్క నీరును వదలవలెను. పిదప __
14. ఓం లోకసాక్షిణే నమః __ తాంబూలాదికం సమర్పయామి
(5తమలపాకులు, 2 పోకుచేక్కలు సమర్పించాలి)
15. ఓం భవాయ నమః __ ప్రదక్షిణం సమర్పయామి (ప్రదక్షణ౦)
16. ఓం కపాలినే నమః __ నమస్కారం సమర్పయామి (సాష్టాంగ నమస్కారం చేయాలి.)
జనక మహారాజా! పైన చెప్పిన విధముగా షోడశ (16) ఉపచారాలతోనూ గాని, లేదా నెల పొడుగునా ప్రతి రోజూ సహస్ర నామయుతంగా గాని శివపూజ చేసి, పూజ యొక్క చివరలో __
మంత్రము :
పార్వతీకాంత దేవేశ పద్మజార్చ్యంఘ్రీ పంకజ
అర్ఘ్యం గృహన దైత్యారే దత్తంచేద ముమాపతే ||
అనే మంత్రముతో అర్ధ్యమును ఇవ్వాలి. అనంతరము యధాశక్తి దీపములను సమర్పించి, శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానమును ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీకము నెల్లాళ్ళూ కూడా బ్రాహ్మణా సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు __ వంద వాజపేయాలు, వెయ్యేసి సోమాశ్వమేధాలూ చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాసనక్త ప్రతాచరన వలన పుణ్యాధిక్యత __ పాపానాశనం అవలీలనగా ఏర్పడతాయి అనడములో ఎటువంటి సంకోచమూ లేదు. కార్తీక చతుర్దశీనాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనము పెట్టడం వలన వాళ్ళయొక్క పితాళ్ళందరూ కూడా సంత్రుప్తులు అవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశినాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశినాడు ఉపవాసము వుండి, శివారాధన చేసి, తిలలను దానము చేసినవాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై మోక్షగాములోతారు. జనక మహారాజా! కార్తీక పురాణములో ముఖ్యంగా ఈ 14 అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా, వినినా కూడా వాళ్లు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు.
ఏవం శ్రీస్కాంద పురాణంతర్గత కార్తీక మహాత్మ్యే
చతుర్ధశాధ్యాయము సమాప్తం
No comments:
Post a Comment