Tuesday, 1 December 2020

కార్తీక పురాణం-20

వింశాధ్యాయము:-
జనకుని కోరికపై వశిష్టుడు __ ఇంకా యిలా చెప్పసాగాడు: ఓ మిధిలారాజ్య ధౌరేయా! ఈ కార్తీక మాహత్మ్యమును గురించి అత్ర్యగస్త్యమునుల నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రిమహముని, అగస్యుని చూసి, 'కుంభసంభవా! లోకత్రయోపకారము కోసము కార్తీక మహత్మ్యబోధకమైన ఒకానొక హరిగాధను వినిపిస్తాను __ విను. వేదముతావు సమానమైన శాత్రము గాని, ఆరోగ్యానికి యీడైన అనందముగని. హరికి సాటియైన దైవముగాని, కర్తీకముతో సమానమైన నేలకాని లేవయ్యా! కార్తీక స్నాన, దీపదానాలూ విష్ణ్వర్చనల వలన సమస్త వాంఛలూ  సమకూరుతాయి. ముఖ్యముగా కలియుగ ప్రాణులు కేవలము విష్ణుభక్తి వలన మాత్రమె విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్ఠాన సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షిభూతముగా పురంజయుని ఇతిహస్యాన్ని చెబుతాను.

పురంజయోపాఖ్యానము 

త్రేతాయుగంలో, సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్రవిధుడు, ధర్మజ్ఞుడూ అయిన ఆ రాజు __ అత్యధికమైన ఐశ్వర్యము కలగడంలో అహంకరించినవాడై __ బ్రాహ్మణ , ద్వేషి దేవ బ్రాహ్మణ భూహర్త, సత్యశౌచ వీహీనుడూ, దుష్టపరాక్రమయుక్తుడూ, దుర్మార్గవర్తనుడూ అయి ప్రవర్తింపసాగాడు.. తద్వారా అతని ధర్మబలము నశించడంతో, సామంతులైన కాంభోజ కురుజాదులనేక మంది యేకమై __ చతురంగ బలలాతో వచ్చి _ అయోధ్యను చుట్టి ముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బాలమదయుక్తుడై __ శత్రువులతో  తలపడెందుకు సిద్దమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నదీ, ప్రకాశించేదీ, జెండాతో అలంకరించబడినదీ, ధనుర్భాణాదిక శాస్రాస్త్రాలతో సంపన్నమైనదీ, అనేక యుద్దాలతో విజయం సాధించినది. చక్కటిగుర్రాలు పూన్చినదీ, తమ సూర్యవంశాన్వయమైనదీ అయిన రధాన్నదిరోహించి __ రధగజతురగపదాతులు __ అనబడే నాలుగు రకాల బలముతో __ నగరము నుండి వెలువడి __ చుట్టుముట్టిన శత్రుసైన్యములపై విరుచుకుపడ్డాడు.  



ఏవం శ్రీస్కాంద పురాణా౦తర్గత కార్తీక మహాత్మ్యే

వింశాధ్యాయము సంపూర్ణం

No comments:

భోగి

                                       🌾🌻🌞  భోగి 🌞🌻🌾 ‣ పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండు...