హే శివా……హే ఈశ్వరా…
హే మహాదేవా…!!
ఓ ఆదిదేవా! నీవు సకలసృష్టి కర్తవురా!.....
అణువణువునా నిండి నిబిడీకృతమై ఉన్న వాడవురా…….
ఈ సకల చరాచర జగత్తుకు మూలానివి నీవే శివా!
ఆద్యంతాలు లేని ఏకైక జ్యోతిర్లింగానివి నీవే కదా తండ్రీ…….
ఓ వైరాగి! బంధాలకు అతీతమైన వాడా
ఋణ విముక్తుడవు, వేదశాస్త్రాల నిధివీ నీవే
అనాధివి నీవే బంధుత్వానివి నీవే శివా ….
సాకరనిరాకరానివి నీవే! సర్వం నీవే కదా పరమేశా!
ఓ గంగాధరా! పతిత పావనమైన గంగను ధరించువాడా….
భాగీరథి ప్రవాహ జలంచే పృధ్విని పరిరక్షించినవాడా ….
లోకానికై జీవనాధారను ధరకు చేర్చినవడా….
వారణాసి పాపనాశినిని ప్రసాదించిన వాడవు…..
నీవే కాశీ విశ్వనాధుడువి కదరా ఈశ్వరా!
ఓ త్రిశూలధారి! భూత, భవిష్యత్, వర్తమనంకు ప్రతీకమైన శులపాణివి…
డమరుక ధ్వనిచే సమ్మోహించి శాంతపరిచేవాడ…..
క్రూర, అతి క్రూర దానవులను సంహరించినవాడ….
పరాక్రమ, జ్ఞాన చైతన్య ప్రకాశానివి నీవే కదరా పినాకపాణి!
ఓ గరళకంఠా! సాగరమధన హాలాహలంతకారి …
గరళమందు కాలకూటం ధరించువాడా ……
శ్వేత వర్ణఛాయ గల మేనిపై నీలిమచ్చ గలవాడా……
విషాన్ని ధారణ చేసి స్రృష్టిని రక్షించినవాడవు నీవే కదరా అమ్రృతమూర్తీ!
ఓ భోళాశంకరా! సనకాది బ్రహ్మాది మునీశ్వరులకు ప్రీతికరమైన వాడా…
దేవా, దానవ, మానవ ప్రియా ఈశ్వరా ….
భక్తి వలన తృప్తి చెందే అభిషేక ప్రియుడవు….
భక్తజన సంరక్షకుడివి నీవే కదరా వామదేవా!
ఓ నాగభూషణ! సర్వ ప్రాణులు సమానమే అని చాటి చెప్పిన వాడా….
కంఠంలో సర్పం, తనువుపై విభూతి, మెడలో కపాలంతో విరాజిల్లు వాడా..
వ్యాఘ్ర చర్మధారివి నీవే…..
వస్తువుల పై ఆసక్తి లేనివాడవు నీవు కాక ఇంకెవరూ కపాలి!
ఓ అర్ధనారీశ్వర! ప్రకృతి, పురుషుడు ఒక్కటే అని వెలుగెత్తి చాటిన వాడా..
సతికి నీ తనువులో సగభాగం ఇచ్చిన వాడవు…..
“శక్తి లేని శివుడు శవంతో సమానం” అని భార్యను ప్రేమించిన వాడా….
నీకంటే ఉత్తమమైన పతి ఈ సకల చరాచర జగత్తులో ఉండగలరా పరమేశా!
ఓ శివ ప్రసన్న మూర్తి! వదనం పై చిరుమందహాసం కలవాడా…..
నిత్యం ప్రసన్నాక్షివై దేదీప్యమానంగా వెలుగుతూ ఉండేవాడా…..
అమ్మతో కూడి ఆహ్లాదకరంగా ఉండే తండ్రివి నీవే కదా….
నిత్యం భక్తుల హృదయాల్లో అలలారే అఖండజ్యోతివి నీవేరా భక్తవత్సలా!
ఓ ఉమాపతి! కైలసగిరిలో కొలువుండే తండ్రి ….
స్త్రీకి గౌరవంలో మొట్టమొదటి స్థానం ప్రసాదించిన ఆదిదేవుడవు….
పార్వతీ ప్రాణ నాధుడవు! నీకు సాటిగా సతిని తీర్చిదిద్దిన వాడవు…..
శివపార్వతులు పరస్పర పూరకాలు అని చెప్పిన ఆది దంపతులు మీరే కదా శివశాంభవి!
ఓం ఆదిభిక్షు! అన్నపూర్ణ ( పార్వతీ) దగ్గర భిక్షం అర్ధించినవాడా….
నీకు తల్లి లేకపోయినా తల్లి ప్రేమను ఈ లోకానికి అందించిన వాడా …
దయా, కరుణా,ప్రేమ అన్నీ ఉన్న అరూపరూపివి …..
ఇన్ని గుణాలు అపారంగా ఉన్న ఏకైక తేజోమూర్తివి నీవే కదరా అంబికానాథా!
అన్ని జన్మలో కన్నా ఉత్తమమైన జన్మను ప్రసాదించిన నీకు నేను ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోవాలి పరమేశ ……
నీకు ఏమైనా సమర్పించాలి అన్న జిజ్ఞాస నాలో కలిగినప్పుడు….
1. జలంతో అభిషేకం చేయాలి అనే తలపు ….. నేనే గంగాధరుడిని!
2. దీపం వెలిగించే తలపు …. నేనే అగ్నిహోత్రుడుని!
3. చల్లని ప్రదేశంలో నీ ఆరాధన……నేనే చంద్రశేఖరుడిని!
4. ఏమైనా వస్తువుని సమర్పించాలి అని నాలో కలిగిన క్షణం ……కుబేరుడు సదా నీ చరణాల వద్ద అలలారుతు ఉంటాడు
5. నీకు ఎంతో ప్రీతికరమైన విభూతి ……నీవే స్మశనవాసివి
6. సంగీతం వినిపించాలి అనే నా మూర్ఖత్వం……. నీవే సంగీత సాహిత్యాలకు , నాట్య శాస్త్రానికి, వేదాల సారానివి ….. నటరాజువి
7. నీకు గుడి కట్టించాలి అనే ఆలోచన ……ఈ సకల సంసారం నీదే …
8. పంచభూతాలకు అధిపతి నీవే , దశమహా విద్యలు నీవే……
ఇంక నేను నీకు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోవాలి …..కేవలం భక్తితో నీవు ఇచ్చిన ఈ మనసును నీ చరణాల వద్ద ఉంచి ప్రణమిల్లగలను. నేను నిన్ను అర్థిస్తున్నాను నాకు ముక్తిని ప్రసాదించి నీలో ఐక్యం చేసుకో తండ్రీ……. శాశ్వత శివ సాన్నిధ్య ప్రాప్తిని కల్పించాలని వేడుకుంటున్నాను. శివలోక మహా ప్నోతి శివేన సహమోదతే!......
శివుడు
ఆదిదేవుడు, వైరగి, యోగి, చంద్రశేఖరుడు, గంగాధరుడు, పినాకపాణి, త్రిశూలధారి, లయకారుడు, ఉమాపతి,ప్రసన్న మూర్తి, గరళకంఠుడు, అర్ధనారీశ్వరుడు, త్రిపురాంతకుడు, పార్వతీ ప్రాణ వల్లభుడు, భోళాశంకరుడు………... సర్వం శివమయం జగత్
కేవలం భక్తి వల్ల ప్రసన్నుడు ….. తనకు సమర్పించే అభిషేకాలు వద్దు అని లేని వాళ్ళకి దానం చెయ్యమని చాటిన వాడు. అలా దానం చేసిన వారికి సదా ఆయన ఆశీర్వాదము ఉంటుందని చెప్పినవాడు …..
హర హర మహాదేవ శంభో శంకరా!!!!……..
భోళా శంకరా
భక్త వత్సలా!!!!.......
5 comments:
Excellent 👌👌👌
I love this
God effort 😃🙂☺️
Wow wt a telugu writer ....
Awasome 👌👌👌
Thank you 😊
Excellent dedication
Post a Comment