Saturday, 22 August 2020

sarwavyapi

.........ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు. చాలా ఆకలిగా ఉంది.  అతడి దగ్గర ఉన్నది ఒక్క రూపాయి మాత్రమే ! దానిcతో తన ఆకలి ఎలా తీర్చుకోవడం?

సంత ఈ చివరి నుండి ఆ చివరికి తిరిగాడు. ఒక చోట కొట్లో ఒక ఇత్తడి దీపం కనిపించింది.

దాని క్రింద ఇలా వ్రాసి ఉంది, ఒక్క రూపాయి మాత్రమే అని.

షాపు వాడి దగ్గరకి వెళ్లి అడిగాడు. ఎందుకు ఇంత తక్కువ డబ్బుకు అమ్ముతున్నావు అని.

ఆ షాప్ వాడు " బాబూ ! ఇది ఒక అద్భుత దీపం. ఇందులో భూతం ఉంది. అది నువ్వు కోరుకున్న కోరికలు అనీ తీరుస్తుంది. అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది. అది ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ఎప్పుడూ దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి. లేదంటే తాను ఇచ్చిన బహుమతులు అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది. అదీ దిని కధ. "

పేదవాడు దానిని ఒక్క రూపాయకు కొనుక్కున్నాడు.
ఇంటికి తీసుకు వెళ్ళాడు . దానిని బాగా రుద్దాడు. *భూతం ప్రత్యక్షం అయ్యింది."* ఏమి కావాలి నీకు? అని అడిగింది.

తనకు ఆకలి వేస్తోంది కనుక భోజనం ఏర్పాటు చెయ్యమన్నాడు. క్షణాలలో పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనం ప్రత్యక్షం అయ్యింది.

భోజనం కాగానే, ఏమి కావాలి నీకు అని " అడిగింది . పడుకోవడానికి మంచం అడిగాడు. వెంటనే హంసతూలికా తల్పం వచ్చేసింది.

 నిద్రపోతూండగా ఏమి కావాలి నీకు అని అడిగింది.

ఒక మంచి ఇల్లు కావాలని అడిగాడు.
వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేసింది.

ఏమి కావాలి నీకు అని అడిగింది.

పేదవాడు ఇపుడు ధన వంతుడు అయ్యాడు.  కోరికలు అడుగుతూనే ఉన్నాడు. అవి తీరుతూనే ఉన్నాయి. అతడికి విసుగు వచ్చేస్తోంది.

ఎన్నని అడగగలడు ? అడగక పోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది. భూతం తో పాటు సంపదలూ పోతాయి. ఎలా ?

పేదవాడికి తన గ్రామంలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు.

తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి ఏమి కావాలి నీకు అని అడిగింది.

భూమిలో ఒక పెద్ద గొయ్యి తియ్యమన్నాడు. వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్య తీసింది భూతం. అందులో ఒక పెద్ద స్థంభం పాత మన్నాడు. పాతేసి ఏమి కావాలి నీకు అని అడిగింది.

ఆ స్థంభం మీద ఎక్కి దిగుతూ ఉండు. నేను మళ్ళీ నీకు చెప్పే వరకూ నువ్వు చెయ్యవలసిన పని ఇదే అని చెప్పాడు పేద వాడు. భూతం ఎక్కడం దిగడం చేస్తూ ఉంది.

పేదవాడు తన ఇంటికి వెళ్లి తాను చెయ్యవలసిన పనులను చెయ్యడం మొదలు పెట్టాడు. తన పొరుగు వారికి తాను ఏమి చెయ్యగలడో ఆయా సహాయాలు చెయ్యడం మొదలు పెట్టాడు. తన సౌఖ్యం, తన ఇరుగు పొరుగు వారి సౌఖ్యమూ చూస్తూ సుఖంగా గడపడం మొదలు పెట్టాడు.

కొన్ని రోజుల తరువాత భూతం ఏమి చేస్తోంది చూడడానికి స్థంభం దగ్గరకి వెళ్ళాడు. భూతం అలసిపోయి
స్థంభం ప్రక్కన నిద్రపోతోంది.

తన విజయ గాధను తనకు మార్గం చూపిన ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి చెప్పాడు.

*ఇక్కడితో కధ పూర్తి కాలేదు, అసలు కధ ఇప్పుడే మొదలవుతుంది.*

ఈ కధ మనది.
ఈ కధనుండి మనం ఏమి నేర్చుకుందాం ?

మన మనసు ఆ భూతం. అది ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ విశ్రాంతి లేకుండా కోరికలు కోరుతూనే ఉంటుంది. ఎప్పుడూ అలసట లేకుండా అడుగుతూ ఉండడమే దానిపని.

 ఆ వృద్ధ సన్యాసి (మన అనుభవం) చెప్పిన...ప్రకారం భూతం నాటిన స్థంభం  "మంత్రం" (దైవ నామ స్మరణ) 
ఎక్కడం దిగడం మంత్రం జపం. జప సాధన ! (మనసు ను స్వాధీనపరచుకుని సాధన) 
అను నిత్యం మంత్ర జప సాధన చెయ్యడం ద్వారా విశ్రాంతి లేని మనస్సు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళడం సాధ్యపడుతుంది.

అపుడు అది ధ్యాన స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. మనసు ధ్యాన స్థితిలోకి వెడితే మనం అత్మ మేలుకొంటుంది.

అంతరాత్మ ఈ ప్రపంచాన్ని ఆనందించడం మొదలుపెట్టి, మనం ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతాము. ఆత్మ ప్రబోధానుసారం ప్రవర్తించడం మొదలు పెడతాం! ఇతరుల సౌఖ్యం కోసం తగిన చర్యలు తీసుకుంటాం.

మన మనసు అద్వితీయమైన శక్తులుకలిగి దైవ మాయచే నిర్మించిబడిన మహ గొప్ప మాయ యంత్రం. అంతే కాక 
దైవ శక్తి నిక్షిప్తమై ఉన్నా 
మహోజ్వల జ్యోతి రూపం.
మనం అడిగినవి అని సమకూర్చే శక్తి స్వరూపం.

ఆలోచనలను అదుపు చేయగలిగితే ఆ దివ్య జ్యోతి వెలుగు కనిపించడం మొదలవుతుంది.
ఆ దివ్యమైన వెలుగు లో దైవ దర్శనం సాధ్యమౌవుతుంది.

మన మనస్సు అవిశ్రాంత స్థితిలో ఉన్నంత వరకూ మనం మన ఆత్మ దర్శనం 
చెయ్యలెము.

మనసుకు విశ్రాంతిని ఇచ్చినపుడే మన ఆత్మ మనకు గోచరం అవుతుంది.  అపుడే మనం ఇహపరలోకాల ఆనందాలను అనుభవించగలం.

మన మనసు మనకు ఆలోచననూ, విచక్షణనూ, కోరికలనూ, అవగాహననూ, విమర్శనాత్మక దృష్టినీ, న్యాయాన్యాయ నిర్ణయాలను తీసుకునే శక్తినీ, ఎన్నింటినో ఇచ్చింది. దానివలన మనం ఈ భౌతిక ప్రపంచం లో జీవనం సాగిస్తూ దైవీ స్థితికి చేరుకోగలం!

భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరం మనసు.
ఆయన తన మనసును ఉపయోగించి ఈ సృష్టిని సృష్టించాడు. మన మనసుకు సరిగా శిక్షణ ఇచ్చి ఉపయోగించుకుంటే అది మనం కోరుకున్న జీవితాన్ని సాధించేలా చేస్తుంది.

ద్యానం, మంత్రం జపమూ చేస్తే అది మనలను ఆత్మ దర్శనం చెయ్యగలిగే స్థితికి చేరుస్తుంది. దాని నియంత్రణలో ఉంచుకోలేక పోతే అది మనలని వినాశనం వైపు నడిపిస్తుంది.

ఒకేసారి అనేక విషయాలను ఆలొచించగలదు. ఒకే ఒక్క విషయం పై కూడా దృష్టి పెట్టగలదు.

మనసుకు శిక్షణ ఇవ్వడం ద్వారా మనం ఎన్నో విజయాలను సాధించగలం. జీవిత లక్ష్యాలను సాధించగలం. దాని మానాన దానిని వదిలేస్తే
( శిక్షణ లేని మనసు ) అది మన వినాశనానికి హేతువులైన దురాశ, పగ, ప్రతీకారం, కామం, క్రోధం, గర్వం, అహంభావం ,  ఇటువంటి అధమ స్థాయి కోరికలకు బానిసలం అయ్యేలా చేస్తుంది.

మన మనసులో కదిలే ఆలోచనలు మన సమయాన్ని , మన దృష్టినీ కోరుతాయి. అవి మన ప్రవర్తనని నిర్ణయిస్తాయి. మాయను అతిక్రమిస్తే ఆనందమనే భవనంలో హాయిగా విహారం చేయవచ్చును. ఇంత కధ నడిపించిన ఆ ఓక రూపాయి ఏమిటో కాదు, మనం చేసుకున్న పుణ్యం.

జగన్నాటకం అనే సంత లోకి వచ్చిన ఈ జీవుడు ఆ దేవుడిని చేరుకునేలోపే మేల్కొంటే నిత్యానంద స్వరూపుడి దివ్య దర్శన భాగ్యం మనకు కలగతుంది.

                          సర్వేజనా సుఖినోభవంతు.

Ganapati Bappa moriya 🙏🙏🙏

 గౌరి పూజ  వినాయక చవితి ముందు రోజు గౌరీపూజ ఎందుకు చేస్తారు ?*_

శక్తికి మూలం దేవత మరియు మంగళకరం , మంగళప్రదానికి సంకేతంగా గౌరీదేవిని పూజిస్తారు. గౌరీ పండుగను భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో జరుపుకుంటారు. గౌరీ గణేష్ , గౌరీ చౌతి లేదా గౌరీ పండుగ అని పిలువబడే ఈ పండుగను గణేశ చతుర్థి సందర్భంగా జరుపుకుంటారు. ఈ పండుగ వివాహిత మహిళలకు అంకితం చేయబడింది. హిందూ క్యాలెండర్ ప్రకారం , గౌరీ పండుగను స్వచ్ఛమైన తృతీయ రోజున జరుపుకుంటారు. గౌరీ పండుగ మరుసటి రోజు , భాద్రపద శుద్ద చతుర్థి రోజు నుండి గణేశ చతుర్థి పండుగ పర్వదినాలు ప్రారంభమవుతాయి.
సౌభాగ్యాలను ప్రసాధించే గౌరీ పండుగను వివాహిత మహిళలలకు జరుపుకుంటారు , గౌరీ దేవిని ఆరాధించడం వల్ల సుఖ , సంతోషాలతో పాటు ఆనందం , సంపద మరియు సుదీర్ఘ జీవితాన్ని ఇస్తుందని మరియు తన భర్తను ఆయుష్యును పెంచి ఆశీర్వదిస్తుందని అంటారు. గౌరీ పండుగ వరమహాలక్ష్మి వ్రత మాదిరిగానే ఉంటుంది. తేడా ఏమిటంటే లక్ష్మి స్థానంలో గౌరీదేవిని పూజిస్తారు.

*గౌరీ మరియు గణేశ*

గౌరీ దేవి / పార్వతీ దేవి ఆమె శరీరానికి లేపనంగా రాసిన పసుపు ముద్ద సహాయంతో గణేషుడిని సృష్టించి. ఆ రోజును గణేశుని పుట్టినరోజుగా భావించారు. ఆ పవిత్ర దినోత్సవాన్ని వినాయక చతుర్థి లేదా గణేశ చతుర్థి అని పిలువబడుతోంది.

*గణేశ చతుర్థి*

సిరిసంపదలు సమృద్ధిగా , జ్ఞానం , గొప్పతనం , దీర్ఘాయువు , ఆరోగ్యం వంటి మంగళప్రదాలను ప్రసాదించే వారు గణేశుడు. హిందూ పంచాగం ప్రకారం , పండుగ భాద్రపద మాసంలో వస్తుంది. అన్నివేలలా కరుణ కలిగి , ఎల్లప్పుడు ఆశీష్యులను ప్రసాధించే గణేష్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు గణేశ చతుర్థిని జరుపుకుంటారు. ఈ పండుగను ఇంటి సాంప్రదాయాల ప్రకారం , ఒక రోజు , మూడు రోజులు , ఏడు రోజులు , పది రోజులు జరుపుకుంటారు. కొంతమంది గౌరీ , గణేశుడి విగ్రహాన్ని గౌరీ ఇంటికి తీసుకువస్తారు, మరో ఇద్దరు గౌరీ విగ్రహాలను కూడా తెచ్చి గణేశుని సోదరీమణులుగా ఆరాధిస్తారు.

పశ్చిమ బెంగాల్‌లో లక్ష్మీ , సరస్వతిని గణేశుడి సోదరీమణులుగా
పశ్చిమ బెంగాల్‌లో లక్ష్మీ , సరస్వతిని గణేశుడి సోదరీమణులుగా పూజిస్తారు. వారు దుర్గాదేవి పిల్లలుగా భావిస్తారు. కొందరు లక్ష్మీ , సరస్వతి గణేశుల ఇద్దరు భార్యలు. రిద్ధి మరియు సిద్ధి. ఇది తరచుగా అనేక అపోహలకు కారణమని చెప్పవచ్చు. ఈ కారణాలన్నింటికీ ఈ పండుగను గౌరీ గణేష పండుగా పిలువబడుతున్నది.

గౌరీ గణేష్ పండుగ యొక్క పురాణం గాథ
పురాణాల ప్రకారం , ఒక రోజు శివుడి నివాసమైన కైలాసంలో గౌరీకి దగ్గరగా కాలకేయులు , ఆప్తులు వంటి వారు ఎవరూ లేరు. ఆ సమయంలో విసుగు చెందిన పార్వతి దేవి స్నానం చేయాలనుకున్నారు. ఎవరైనా ఇంటి తలుపు వద్ద కూర్చొండి బెట్టి స్నానానికి వెల్లాని అనుకుంటుంది. కానీ ఎవరూ లేరని ఆమె బాధపడింది. అప్పుడు ఆమె తన శరీరానికి అతుక్కుపోయిన పసుపు నుండి ఒక విగ్రహాన్ని తయారు చేసి ప్రాణం పోస్తుంది


ఆమెకు విగ్రహం చూడగానే చాలా ఇష్టపడుతుంది. ఆ ఇష్టంతోనే ఆమె ఆ విగ్రహమూర్తికి గణేశ అని పేరు పెట్టింది. తర్వాత ఆమె పరిస్థితిని గణేశునికి వివరించి , ఇప్పుడు నేను స్నానం చేయబోతున్నాను. ఎవరినీ లోపలికి రానివ్వకండి అని చెబుతుంది. అంగీకరించిన గణేష్ ద్వారపాలకుడిగా తల్లికి కాపలా కాస్తూ నిలబడుతాడు. అంతలో ఆ పరమేశ్వరుడు రానే వస్తాడు , లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించగా గణేశుడు ఆ పరమేశ్వరుడిని అడ్డుకుంటాడు. కానీ తల్లి ఆజ్ఞను పాటిస్తున్న గణేశుడు శివుడిని లోపలికి వెళ్ళడానికి అనుమంతించకుండా ఆపుతాడు.

శివుడు పార్వతి దేవి పతిదేవుడనే విషయం గణేశుడికి , గణేశుడు పార్వతి దేవి సృష్టించి కుమారుడని శివుడికి తెలియదు. ఈ కారణంగానే ఇద్దరి మద్య వాద వివాదాలు జరుగుతాయి. ప్రవేశ ద్వారం వద్ద తండ్రి అడ్డుకున్న గణేశడు తన కుమారుడే అని గుర్తించిన ఆ పరమేశ్వరుడు ఆగ్రహావేశాలకు గురి అయ్యై గణేశుడి తలను నరికివేస్తాడు.

బాలుని హాహాకారాలు విన్న పార్వతీ దేవీ
బాలుని హాహాకారాలు విన్న పార్వతీ దేవీ పరుగున వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న కుమారుని చూచి నిశ్చేష్టురాలైంది. భర్తతో వాదులాడింది. జరిగిన తప్పు తెలుసుకున్న కైలాసనాథుడు పశ్చాత్తాపపడ్డాడు. బాలునికి ప్రాణం పోస్తానని మాట ఇచ్చాడు.

ఇది తేలిసిన పార్వతి ఆగ్రహించి ఎలాగైనా వినాయకుడిని బ్రతికించాలి అని కోరుకుంటుంది . చనిపోయిన వ్యక్తికి ఉత్తరాన ఉన్న తలను పెట్టాలి అని శివుడు చెప్తాడు కావున భటులు ఉత్తర దిక్కున్న పడుకున్న వ్యక్తి తలా కోసం వేటుకుతారు అయినప్పటికీ చివరిగా వారికి ఒక్క ఏనుగు తలా మాత్రమే దొరుకుతుంది. శివ శిశువు మీద ఏనుగు తలను స్థిరపెట్టి , అతనికి తిరిగి జీవానికి తీసుకువచ్చాడు.

గౌరీ చతుర్థి ఆచారం*

మహిళలు చతుర్తికి ముందు రోజు ఈ దేవిని పూజించడం ఆచారంగా వస్తోంది. అమ్మ విగ్రహాన్ని పసుపుతో అలంకరించి బియ్యం లేదా ధాన్యాల కలశం ఉంచడం జరగుతుంది. పూలు , పండ్లు సమర్పించి పూజిస్తారు. మరుసటి రోజు గణేశుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు.

family

*ఆ రోజులే బాగున్నాయ్* !
�----------�----------�

టెన్షన్లు.. 
ఒత్తిళ్లు...  
డబ్బు సంపాదన...
అతిగా ఆలోచనలు లేకుండా...
ఉన్నంతలో కుటుంబమంతా కలసి... 
ఆనందంగా గడిపిన .
�ఆ రోజులు బాగున్నాయ్..!

ఆదివారం 
ఆటలాడుతూ... 
అన్నాన్ని మరచిన 
�ఆ రోజులు బాగున్నాయ్..!

మినరల్ వాటర్ గోల లేకుండా...
కుళాయి దగ్గర, 
బోరింగుల దగ్గర, 
బావుల దగ్గర... 
నీళ్లు తాగిన...
�ఆ రోజులు బాగున్నాయ్..!


వందలకొద్దీ చానెళ్లు లేకున్నా...
ఉన్న ఒక్క దూరదర్శన్ లో 
శుక్రవారం చిత్రలహరి... 
ఆదివారం సినిమా కోసం వారమంతా... 
ఎదురు చూసిన 
� ఆ రోజులు బాగున్నాయ్..!

సెలవుల్లో 
అమ్మమ్మ.. 
నానమ్మల ఊళ్లకు వెళ్లి... 
ఇంటికి రావాలనే ఆలోచన లేని...
� ఆ రోజులు బాగున్నాయ్..!

ఏసీ కార్లు లేకున్నా 
ఎర్రబస్సుల్లో...
కిటికీ పక్క సీట్లో నుండి 
ప్రకృతిని ఆస్వాదించిన 
� ఆ రోజులు బాగున్నాయ్...!

మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా...
బర్త్ డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ... 
చాక్లెట్లు పంచిన 
� ఆ రోజులు బాగున్నాయ్..!

మటన్ బిర్యానీ.. 
చికిన్ బిర్యానీ లేకున్నా... 
ఎండాకాలం వచ్చిందంటే 
మామిడి కాయ పచ్చడితో...
అందరం కలసి
కడుపునిండా అన్నం తిన్న...
� ఆరోజులు బాగున్నాయ్..!

ఇప్పుడు జేబు నిండా కార్డులున్నా... 
పరుసు నిండా డబ్బులున్నా...
కొట్టుకు పంపితే ...
మిగిలిన చిల్లర కాజేసిన
� ఆ రోజులే బాగున్నాయ్..!

సెల్లు నిండా గేములున్నా...
బ్యాట్ మార్చుకుంటూ 
ఒకే బ్యాట్ తో క్రికెట్టాడిన.. 
� ఆ రోజులే బాగున్నాయ్...!

ఇప్పుడు బీరువా నిండా ప్యాంట్లున్నా... 
రెండు నిక్కర్లతో బడికెళ్లిన...
� ఆ రోజులే బాగున్నాయ్..!


ఇప్పుడు బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా... .
ఐదు పైసల ఆశా చాక్లెట్ తిన్న...
� ఆ రోజులే బాగున్నాయ్...!

చిన్న చిన్న మాటలకే దూరం పెంచుకుంటున్న ఈ రోజుల్లో..
పిల్లలం కొట్టుకున్నా 
పెద్దలంతా కలసివుండే
#ఆ రోజులే బాగున్నాయ్..! 

ఇప్పుడు ఇంటినిండా తినుబండారాలున్నా...
నాన్న కొనుక్కొచ్చే ...
చిరుతిళ్ళ కోసం ఎదురు చూసిన..
#ఆ రోజులే బాగున్నాయ్..!

ఇప్పుడు రకరకాల 
ఐస్ క్రీమ్ లు చల్లగా నోట్లో నానుతున్నా...
అమ్మ చీరకొంగు పైసలతో 
పుల్ల ఐసు కొనితిన్న...
#ఆ రోజులు ఎంతో బాగున్నాయ్..!

పొద్దుపోయేదాకా 
చేలో పని చేసుకొచ్చి...
ఎలాంటి చీకూచింత లేకుండా.. 
ఎండాకాలంలో ఆకాశంలోని 
చందమామను చూస్తూ నిదురించిన..
#ఆ రోజులు బాగున్నాయ్..!


 *ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది*
అమ్మ, నాన్న,.... 
అక్క బావ...
చెల్లి మర్ది.... 
అన్న వదిన.... 
తమ్ముడు మర్దలు.... 
మేనత్త మేనమామ.... 
పిన్ని బాబాయ్..... 
పెద్దమ్మ పెదనాన్న.... 
తాతయ్య అమ్మమ్మ.... 
తాతయ్య నానమ్మ..... 
ఒదిన, మరదలు....
బావ బామ్మర్ధి.....
ఇంకా.... 
ముత్తాత తాతమ్మ....
ఇలా వరుసలు ఉన్నాయని.... ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం....


మమ్మి డాడి..... ఆంటీ అంకుల్
ఇవి రెండు తెలిస్తే చాలు....
ప్రపంచమంతా మన బందువులే అనే భావన ఏర్పడింది.


రక్త సంభందం అంటే ఏంటో తెలియని దుస్తితి....


కారణం.....
పుట్టగానే పిల్లలను క్రెచ్చ్ ల్లో వేయడం....
లేదా ఆయాలకు అప్పగించడం...

అందాలకు బందీలై తల్లి పాలు కూడా ఇవ్వకపోవడం....
ముడ్డి కడగడం మానుకొని డైపర్స్ వాడడం....
ఇంకెక్కడి ప్రేమలు... లాలనలు....
ఇక్కడినుండే మొదలు....
ఇక కాన్వెంట్లు..... రెసిడెన్సు స్కూళ్లు....

వాడికి ఎవడు చుట్టమో... ఎవడు పక్కమో తెలియని పరిస్థితి ....
ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప మరేమీలేదు....


ఇంజనీరింగ్ చేయడం.... 
ఎమ్మెస్ కని విదేశాలకు వెళ్ళడం..... 


వాట్సాప్ లో చాటింగ్....
ఐ ఎం ఓ లో విజిటింగ్....
స్కైప్ లో వీడియో కాలింగ్....
అమేజాన్ ద్వారా షాపింగ్....
నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపిస్తే.... వీరికదే ఆనందం....


పెళ్లి ముందురావడం.... అయిపోగానే పెళ్ళాన్ని తీసుకొని పోవడం..... 

ఇంకెక్కడి ప్రేమలు... ఆప్యాయతలు....
అయ్యా, అమ్మ సస్తే తప్ప.... 

కనీసం దాయాదులు పోయినా....
దగ్గరోడు సచ్చినా....

దయలేని దుస్థితి ....
చూడలేని పరిస్థితి ....
ఇంకెక్కడి బందాలు....
ఇంకెక్కడి బందుత్వాలు....
అందుకే....
కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది....

అందుకే రోజు రోజుకు ఓల్డ్ ఏజ్ హోం ల సంఖ్యలు పెరుగుతూ పోతున్నాయి.....


బాల్యం నుండే మార్పు రావాలి...
బందాలు పెరగాలి....
అమ్మమ్మ, నానమ్మ ల కథలు వినాలి....
తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి....
కుటుంబం లో ఉండే ఆనందం తెలపాలి....
అది మనింటినుండే ప్రారంభం కావాలి....


కలసి బోజనం చేసి.... కలసి ముచ్చటించడం నేర్పాలి....
ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి....

మళ్ళీ ప్రపంచానికి మన దేశం వసుదైక కుటుంబం అని చాటి చెబుదాం....🌹
💑👨‍👨‍👧👨‍👩‍👦‍👦👨‍👨‍👧‍👦👨‍👨‍👦‍👦👩‍👩‍👦

భోగి

                                       🌾🌻🌞  భోగి 🌞🌻🌾 ‣ పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండు...